రాజధాని అమరావతి పరిధిలోని 19 గ్రామాలను ఒక మున్సిపల్ కార్పొరేషన్‌గా మార్పు చేసేందుకు ఈ నెల 6వ తేదీ నుంచి గ్రామ సభలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. పంచాయతీరాజ్ కమిషనర్ కోన శశిధర్ ఆదేశాల మేరకు సోమవారం జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
రాజధాని ప్రాంతంలోని తుళ్లూరు మండలంలోని 16 గ్రామాలు, మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, నీరుకొండ, నిడమర్రు గ్రామాలను కలిపి అమరావతి క్యాపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎసిసిఎంసి)గా మార్చేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.
6వ తేదీన లింగాయపాలెం, ఉద్దండరాయునిపాలెం, వెంకటపాలెం, 7న వెలగపూడి, మల్కాపురం, మందడం, 10న బోరుపాలెం, అబ్బరాజుపాలెం, నెక్కల్లు, అనంతవరం, 11న ఐనవోలు, శాఖ మూరు, నేలపాడు, దొండపాడు, 12న రాయపూడి, తుళ్లూరులో గ్రామసభలు నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

More Stories
శ్రీవారి సేవలో పట్టుకు బదులు పాలిస్టర్ శాలువాలు
2 నెలల పాటు పర్వదినాల్లో టిటిడి వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
ఏపీలో ‘అటల్ సందేశ్ – మోదీ సుపరిపాలన’ యాత్ర