కరోనా మహమ్మారి ప్రపంచంలోని అన్ని దేశాలను ప్రభావితం చేస్తున్నదని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ చెప్పారు. ఇవాళ జరిగిన భారత్-సెంట్రల్ ఏసియా మూడో మాట్లాడుతూ వ్యాక్సిన్‌ల తయారీ, ఎగుమతుల్లో భారత్ దూసుకుపోతున్నదని తెలిపారు. ఇప్పటివరకు ప్రపంచంలోని 90కి పైగా దేశాలు భారత్ నుంచి వ్యాక్సిన్‌లు దిగుమతి చేసుకున్నాయని పేర్కొన్నారు.
కరోనా మహమ్మారి సమయంలో వివిధ దేశాల్లోని భారతీయ విద్యార్థుల సంక్షేమం ఆయా దేశాలతో సంబంధాల వేగాన్ని స్తంభించేలా చేసిందని ఆయన చెప్పారు. ఈ పరిస్థితిని పరస్పరం మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉన్నదని ఆయన గుర్తుచేశారు.
ఆఫ్ఘనిస్థాన్‌తో మనందరికి మంచి సంబంధాలు ఉన్నాయని చెబుతూ అక్కడ ఉగ్రవాదం, మాదకద్రవ్యాల సరఫరా.. మహిళలు, పిల్లలు, మైనారిటీల హక్కుల హరణం ఆందోళన కలిగించే అంశాలని జయశంకర్ తెలిపారు.
మధ్య ఆసియాలోని బాధ్యతాయుతమైన అన్ని దేశాలతో భారత్‌కు మంచి సంబంధాలున్నాయని చెబతూ ఉగ్రవాదం, డ్రగ్స్ అక్రమరవాణాకు వ్యతిరేకంగా పోరాడుతున్న దేశాలకు తమ సహకారం ఉంటుందని జయశంకర్ చెప్పారు.
అంతకుముందు పలు దేశాల మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ప్రపంచమంతా కరోనా క్రైసిస్‌లో అల్లాడుతున్న సమయంలో భారత్ దాదాపు 90 దేశాలకు వ్యాక్సిన్లు సరఫరా చేసి ఆదుకుందని ఆయన గర్తు చేశారు. అంతా కలిసి పని చేస్తే ఈ మహమ్మారిని మరింత సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని చెప్పారు.

More Stories
నేపాల్లో మళ్లీ జెన్ జెడ్ నిరసనలు.. కర్ఫ్యూ!
ఆపరేషన్ సిందూర్ సమయంలో రఫెల్ పై చైనా అసత్య ప్రచారం
భారత్లో భారీ దాడులకు జైషే విరాళాల సేకరణ