సొంత పార్టీ నేతలనే శిబిరాలకు తరలిస్తున్న టీఆర్ఎస్

సొంత పార్టీ ప్రజా ప్రతినిధులనే నమ్మలేక ఎమ్యెల్సీ ఎన్నికలలో టీఆర్ఎస్​ వారిని శిబిరాలకు తరలిస్తున్నదని బిజెపి నాయకుడు, మాజీ మంత్రి బాబూమోహన్ ఎద్దేవా చేశారు. సొంతపార్టీ ప్రజాప్రతినిధులే టీఆర్​ఎస్​కు ఎదురుతిరుగుతున్నారని, వాళ్లను కాపాడుకునేందుకు క్యాంపులకు తరలించి  కాపలా కాస్తున్నారని గుర్తు చేశారు. 

సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మెద‌‌క్ స్థానికసంస్థల నుండి ఎమ్యెల్యే ఎన్నికలలో టీఆర్ఎస్​కు మెజారిటీ ఉన్నా తమ పార్టీ వారిని శిబిరాలకు తరలించడమంటే వారిమీద నమ్మకం లేనట్టేనని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ టికెట్​ మీద గెలిచిన నేతలే ఆ పార్టీని నమ్మడం లేదంటే ప్రజలు, రైతులు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. 

అసంతృప్తి వాదులంతా బీజేపీకి ఓటేస్తామని అభ్యర్థిని  నిలబెట్టాలని సూచించారని,  కానీ అధిష్టానం నిర్ణయం మేరకు పోటీకి దూరంగా ఉన్నట్టు ఆయన చెప్పారు. వడ్ల కొనుగోలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ విధానం స్పష్టంగా ఉందని ఆయన తెలిపారు. కానీ టీఆర్​ఎస్​ ప్రభుత్వం  బుర‌‌ద‌‌ జ‌‌ల్లుతోందని మండిపడ్డారు.  

హుజూరాబాద్ ఎన్నిక‌‌ల్లో ఓట‌‌మి తర్వాత ప్రభుత్వం రైతులను వేధిస్తోందని బాబూమోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  ​ రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్న  టీఆర్ఎస్​కు వారి ఉసురు తగులుతుందని హెచ్చరించారు. కేసీఆర్, ఆయ‌‌న బృందం  మాట్లాడే భాష అనాగ‌‌రికులు కూడా వాడరని ధ్వజమెత్తారు.  ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాప‌‌న చేస్తోంద‌‌ని ఆయన విమర్శించారు. వరి వేయొద్దంటున్న కేసీఆర్​ లక్షల కోట్ల రి[ఆయా;ఐ  ఖర్చుపెట్టి ప్రాజెక్టులు ఎందుకు బిజెపి నేత కట్టారని ప్రశ్నించారు.