ఆస్ట్రేలియాలో వివాదాస్పద మత వివక్ష వ్యతిరేక బిల్లు

వివాదాస్పద మత వివక్ష వ్యతిరేక బిల్లును ఆస్ట్రేలియా ప్రభుత్వం గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ఆమోదం పొందినట్లైతే  మత విశ్వాస సంస్థలు తమ విశ్వాసాలకు అనుగుణంగా వ్యక్తులను నియమించుకోవచ్చు.. వారికి గుర్తింపునివ్వవచ్చు. 

“వివక్ష అనేది సంభవించినట్లయితే అది చట్టవిరుద్ధం, ఉదాహరణకు, వ్యక్తి కలిగి ఉన్న లేదా నిమగ్నమైన మత విశ్వాసం లేదా కార్యకలాపం. మతపరమైన విశ్వాసాన్ని కలిగి ఉన్న లేదా నిమగ్నమై ఉన్న వ్యక్తితో లేదా నిమగ్నమై ఉన్న వ్యక్తితో అనుబంధం కారణంగా సంభవించినట్లయితే అది కూడా చట్టవిరుద్ధం. కార్యకలాపాలు, వారు తమను తాము కలిగి ఉన్నారా లేదా అనే దానితో సంబంధం లేకుండా మతపరమైన విశ్వాసం లేదా కార్యాచరణలో పాల్గొంటారు,” అని బిల్లు పేర్కొంది.

గత కొన్నేళ్లుగా ఆస్ట్రేలియాలో మతస్వేచ్ఛపై ఆందోళనలు జరుగుతున్నాయి. చర్చ్‌లు, పాఠశాలలు, కార్యాలయాల్లో ఉద్యోగులు స్వేచ్ఛగా తమ మత విశ్వాసాలను వ్యక్తపరచలేకపోతున్నామంటూ ఆందోళనలు చేపడుతున్నారు. 

వచ్చే ఏడాది మేలో ఆస్ట్రేలియాలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మత ఓటర్లను ఆకట్టుకునేందుకే ఈ బిల్లు ప్రవేశపెట్టారని ప్రతిపక్షాలు దుయ్యబడుతున్నాయి. ఈ బిల్లుతో కార్యాలయాలకు వెలుపల ఉద్యోగులు తమ మత విశ్వాసాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయవచ్చని ప్రధాని స్కాట్‌ మారిసన్‌ పేర్కొన్నారు. 

ఒక్కొక్కరి మత విశ్వాసాలు ఒక్కో విధంగా ఉంటాయని, అందుకని వారిని దూషించడం, వారిపై నిషేధం విధించడం వంటివి చేయరాదని పార్లమెంట్‌ దిగువ సభలో బిల్లును ప్రవేశపెట్టే సమయంలో మారిసన్‌ పేర్కొన్నారు.

ఆస్ట్రేలియాలో ఇప్పటికే కొనసాగుతున్న లింగ వివక్ష చట్టంలో కూడా సవరణలు చేస్తానని మారిసన్‌ 2018లో ప్రకటించారు. ఎల్‌జిబిటి గ్రూప్‌ ఈ సవరణలు చేపట్టేందుకు అంగీకరిస్తున్నప్పటికీ, నూతన మత పరమైన వివక్ష వ్యతిరేక చట్టాన్ని విమర్శిస్తున్నాయి. 

మత విశ్వాసాల ఆధారంగా నియామకాలు చేపడితే  గే విద్యార్థులు, ఉపాధ్యాయుల పట్ల వివక్ష ఇంకా పెరుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంటులో కూడా ఈ బిల్లుపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కన్జర్వేటివ్స్‌ ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. వచ్చే వారం ఈ బిల్లుపై ఓటింగ్‌ జరగవచ్చు.