తొలి రోజే రాజీనామా చేసిన స్విట్జ‌ర్లాండ్ తొలి మ‌హిళా ప్ర‌ధాని

సోష‌ల్ డెమోక్రాట్స్ నాయ‌కురాలు మ‌గ్ద‌లినా అండ‌ర్స‌న్ స్వీడ‌న్ ప్ర‌ధానిగా ఎంపిక‌య్యారు. స్వీడ‌న్ పార్ల‌మెంట్‌లో జ‌రిగిన ఓటింగ్‌లో మ‌గ్ద‌లినాకు మెజారిటీ ఓట్లు వ‌చ్చాయి. దాంతో ఆమె ప్ర‌ధానిగా ఎన్నికైన‌ట్లు ప్ర‌కటించారు. అయితే అండెర్స‌న్ బాధ్య‌త‌లు చేప‌ట్టిన తొలి రోజే రాజీనామా  చేయవలసి వచ్చింది.

12 గంట‌ల పాటు ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించిన ఆమె కూట‌మిలో భాగ‌స్వామి అయిన గ్రీన్ పార్టీ త‌ప్పుకోవ‌డంతో ఆమె త‌న ప‌ద‌విని వదులుకోవలసి వచ్చింది. స్వీడన్ పార్లమెంటులో మొత్తం 349 మంది సభ్యులుండగా, ప్రధాన మంత్రి పదవికి జరిగిన ఓటింగ్‌లో మగ్దలీనాకు అనుకూలంగా 117 ఓట్లు లభించాయి.ఆమెకు వ్యతిరేకంగా 174 మంది ఓటు వేశారు.57 మంది ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఒకరు గైర్హాజరు అయ్యారు. 

ఈ విజ‌యంతో మ‌గ్ద‌లినాకు మ‌రో ఘ‌న‌త కూడా ద‌క్కింది. స్వీడ‌న్ దేశానికి ప్ర‌ధానిగా ఎంపికైన తొలి మ‌హిళ‌గా ఆమె ప్ర‌త్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. 2022లో స్వీడ‌న్‌లో సాధార‌ణ ఎన్నిక‌లు జ‌రుగ‌నున్నాయి. త‌న త‌ద‌నంత‌రం కాబోయే ప్ర‌ధానికి ఈ ఎన్నిక‌ల స‌న్న‌ద్ధత కోసం త‌గినంత స‌మ‌యం ఇవ్వాల‌నే ఉద్దేశంతో స్వీడ‌న్ ప్ర‌ధాని స్టీఫ‌న్ లోఫ్‌వెన్ ఈ నెల 10న ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఆయ‌న గ‌త ఏడేండ్లుగా స్వీడ‌న్ ప్ర‌ధానిగా ప‌నిచేశారు. 

ఈ నెల ప్రారంభంలో స్టీఫ‌న్ లోఫ్‌వెన్ ప్ర‌ధాని ప‌ద‌వి నుంచి తప్పుకోనున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దాంతో వెంట‌నే ఆ దేశ ఆర్థిక మంత్రిగా ఉన్న మ‌గ్ద‌లినా అండ‌ర్స‌న్‌ను సోష‌ల్ డెమోక్రాట్స్ నాయ‌కురాలిగా ఎన్నుకున్నారు. 

అయితే త్వ‌ర‌లోనే ప్ర‌ధానిగా నియ‌మితురాల‌య్యే అవ‌కాశాలు ఉన్న‌ట్లు సోష‌ల్ డెమోక్రాట్స్ పార్టీకి చెందిన మ‌గ్ద‌లీనా తెలిపారు.
కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌వేశపెట్టిన బిల్లును తిర‌స్క‌రించిన నేప‌థ్యంలో గ్రీన్ పార్టీ ప్ర‌భుత్వం నుంచి త‌ప్పుకున్న‌ది. ప్ర‌ధాని బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించాలంటూ స్పీక‌ర్‌ను కోరినట్లు అండ‌ర్స‌న్ తెలిపారు.

యూరప్ దేశాల్లో లింగ సమానత సంబంధ ప్రగతిశీల దేశంగా పేర్కొంటున్న స్వీడన్‌లో ఇప్పటివరకు అత్యున్నత పదవిని మహిళలు సాధించనప్పటికీ ఇప్పుడు మహిళ ప్రధానిగా మగ్దలినా అధిరోహించడం చెప్పుకోతగ్గ విషయం. స్టీఫెన్ ప్రభుత్వం తనకు తాను స్త్రీవాదిగా పేర్కొంటున్నప్పటికీ దేశ, అంతర్జాతీయ స్థాయిలో స్త్రీలకు, పురుషులకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నట్టు వివరించింది. 

అండర్సన్‌కు మద్దతు ఇచ్చిన ఇండిపెండెంట్ సభ్యురాలు అమినే కకబవె పార్లమెంటులో మాట్లాడుతూ స్కాండినేవియన్ దేశాల్లో సార్వత్రిక ఎన్నికల్లో స్త్రీపురుషులకు సమాన ఓటు హక్కు కల్పించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా స్వీడన్ వేడుకలు జరుపుకొంటోందని గుర్తు చేశారు.  అయినా ఇప్పటివరకు మహిళలు ఎవరూ ఉన్నత పదవుల్లోకి ఎంపిక కాలేదని, అందువల్ల ఇప్పుడీ నిర్ణయంలో ఏదో ప్రత్యేకత ఉందని ఆమె అభివర్ణించారు. 

ప్రధానిగా ఎన్నికైన అండర్సన్ మాట్లాడుతూ తాను మహిళా ప్రధానిగా ఎన్నికయ్యానంటే మన దేశంలో మహిళలకు ఎంత ప్రాధాన్యం ఉందో దీనిబట్టి తెలుస్తుందని పేర్కొన్నారు. సోషల్ డెమొక్రటిక్ , గ్రీన్ పార్టీల కూటమి ప్రభుత్వాన్ని మగ్దలీనా శుక్రవారం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. లెఫ్ట్‌పార్టీ, సెంటర్ పార్టీల మద్దతును కూడా ఆమె కోరవచ్చు. అంతవరకు స్టీఫెన్ నేతృత్వంలో ఆపద్ధర్మ ప్రభుత్వం నడుస్తుంది.