పోలీసు విచార‌ణ‌కు హాజ‌రైన ప‌రంబీర్ సింగ్‌

ముంబై మాజీ పోలీసు క‌మిష‌న‌ర్ ప‌రంబీర్ సింగ్‌ ఇవాళ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. మ‌హారాష్ట్ర‌లో ఆయ‌న‌పై నాలుగు బెదిరింపు కేసులు న‌మోదు అయిన విష‌యం తెలిసిందే. మే 4 నుంచి కనిపించని ఆయనను గత నెలలో పరారీలో ఉన్నట్లు కోర్ట్ ధృవీకరించింది.  ఇవాళ అనూహ్యంగా ముంబై న‌గ‌రంలోని క్రైం బ్రాంచీ యూనిట్ 11 పోలీసుల ముందు హాజ‌రయ్యారు. 

ఆదివారం చంఢీఘ‌డ్‌లో పరంబీర్‌సింగ్ క‌నిపించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేర‌కు తాను విచార‌ణ‌లో పాల్గొనున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. వివిధ కేసుల్లో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ప‌రంబీర్‌కు సుప్రీంకోర్టు హామీ ఇచ్చింది. ప‌రంబీర్‌ను అరెస్టు చేయ‌వ‌ద్దు అంటూ సోమ‌వారం సుప్రీం తీర్పుఇచ్చింది. తానేమీ దేశం విడిచి వెళ్లలేద‌ని కూడా కోర్టుకు ఆయ‌న తెలిపారు.

గోరేగావ్ బెదిరింపు కేసులో విచార‌ణ ఎదుర్కొనేంద‌కు ఇవాళ పరంబీర్ సింగ్కం డీవ‌లిలోని క్రైమ్ బ్రాంచీ యూనిట్ 11 పోలీసుల ముందు హాజ‌ర‌య్యారు.మ‌హారాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి అనిల్ దేశ్‌ముక్ అవినీతికి పాల్ప‌డిన‌ట్లు ప‌రంబీర్ ఆరోపించారు. ఆ కేసులో ప్ర‌స్తుతం దేశ్‌ముఖ్‌ను అరెస్టు చేశారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఈడీ క‌స్ట‌డీలో ఉన్నారు. 

మరోవంక, ఎన్సీబీ జోనల్‌ అధికారి సమీర్‌ వాంఖడే, ఆయన కుటుంబంపై డిసెంబర్‌ 9 వరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయనని మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ తెలిపారు. బాంబే హైకోర్టు ద్విసభ్య ధర్మానం హెచ్చరిక నేపథ్యంలో ఈ మేరకు కోర్టుకు భరోసా ఇచ్చారు. 

మంత్రి నవాబ్‌ మాలిక్‌ తమ కుటుంబానికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న పోస్టింగ్‌లపై సమీర్‌ వాంఖడే తండ్రి ధ్యాన్‌దేవ్ వాంఖడే రూ.1.25 కోట్లకు పరువునష్టం దావా వేశారు. తమకు వ్యతిరేకంగా ఆయన వ్యాఖ్యలు, పోస్టులు చేయకుండా శాశ్వతంగా నిషేధం విధించాలని కోర్టును కోరారు.