చంద్రగుప్తుడు అలెగ్జాండర్‌ను ఓడించాడు, కానీ ‘గ్రేట్’ అనరే!

మౌర్య రాజ్యాన్ని స్థాపించిన చంద్రగుప్త మౌర్యుడు మాసిడోనియాకు చెందిన `జగత్ విజేత’ అని ప్రకటించుకున్న అలెగ్జాండర్‌ను ఓడించాడని, అయినప్పటికీ చరిత్రకారులు అతన్ని “గ్రేట్” అని వర్ణించలేదని  ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విస్మయం వ్యక్తం చేశారు.  

“చరిత్ర ఎన్నడూ అశోక చక్రవర్తి లేదా చంద్రగుప్త మౌర్యుని`గ్రేట్’ పేర్కొనలేదు, కానీ చంద్రగుప్త మౌర్యుని చేతిలో ఓడిపోయిన అలెగ్జాండర్‌ను `గ్రేట్’ అని పేర్కొంది. ఇలాంటి విషయాలపై చరిత్రకారులు మౌనంగా ఉన్నారు. అయితే, దేశప్రజలు ఒక్కసారి నిజం తెలుసుకుంటే, భారతదేశం మారుతుంది” అని బీజేపీ ఓబీసీ మోర్చా నిర్వహించిన “సామాజిక ప్రతినిధి సమ్మేళనం”లో ప్రసంగిస్తూ ఆదిత్యనాథ్ తెలిపారు.

ఆదిత్యనాథ్ సమాజ్‌వాదీ పార్టీపై  మండిపడుతూ “విభజన అంశాన్ని  తీసుకురావడం” ద్వారా ఒక విధంగా తాలిబాన్‌కు మద్దతు ఇస్తున్నారని చెప్పారు. ఎస్పీ మిత్రపక్షం, సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధినేత ఓం ప్రకాష్ రాజ్‌భర్ గురువారం, మొహమ్మద్ అలీ జిన్నాను దేశానికి మొదటి ప్రధానమంత్రిగా చేసి ఉంటే భారతదేశం ఐక్యంగా ఉండేదని పేర్కొన్న ఒక రోజు తర్వాత, విభజనకు ఆర్ ఎస్ ఎస్ కారణమని నిందించారు.

గత నెలలో, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ పాకిస్తాన్ వ్యవస్థాపకుడిని మహాత్మా గాంధీ, వల్లభాయ్ పటేల్, జవహర్‌లాల్ నెహ్రూలతో సమానం ప్రస్తావించారు. “విభజన గురించి మాట్లాడే వారు ఒక విధంగా తాలిబాన్‌లకు మద్దతు ఇస్తున్నారు. తాలిబాన్ మళ్లీ ఆఫ్ఘనిస్తాన్‌లోకి ప్రవేశించినప్పుడు, దానికి మద్దతుగా అనేక స్వరాలు లేవనెత్తడం మీరు చూసి ఉంటారు. కఠిన చర్యలు తీసుకున్నప్పుడే ఈ గొంతులు నిశ్శబ్దంగా మారతాయి” అని యుపి ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 

 
తాలిబాన్‌లకు మద్దతు ఇవ్వడం అంటే మానవత్వ వ్యతిరేక శక్తులకు మద్దతు ఇవ్వడం, మహిళలు, పిల్లలను అవమానించడం అని ఆదిత్యనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాలిబాన్‌కు మద్దతు ఇవ్వడం అంటే బుద్ధ భగవానుని ‘మైత్రి [స్నేహం]’ సందేశానికి వ్యతిరేకంగా పనిచేసే శక్తికి మద్దతు ఇవ్వడం అని ధ్వజమెత్తారు. 
 
కొందరు వ్యక్తులు ఆ దిశగా పయనిస్తున్నారని పేర్కొంటూ మనం వారి గురించి తెలుసుకోవాలని ముఖ్యమంత్రి బిజెపి కార్యకర్తలను కోరారు.
ప్రతిపక్షాలకు సమస్యలు లేవని, జిన్నాకు మద్దతు ఇవ్వడం ద్వారా సర్దార్ పటేల్‌ను అవమానిస్తున్నారని ఆదిత్యనాథ్ ఆరోపించారు. 
 
సర్దార్ పటేల్ భారతదేశానికి “జాతీయ నాయకుడు [జాతి హీరో]” అయితే జిన్నా ఎప్పుడూ “ఖల్నాయక్ [విలన్]” అని ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు. “వారు జిన్నాకు మద్దతు ఇస్తున్నారు. మేము సర్దార్ పటేల్‌కు మద్దతు ఇస్తున్నాము,” అని ఆయన స్పష్టం చేశారు. జిన్నాను కీర్తించిన వారికి మద్దతు ఇస్తారా అని ఆయన ప్రేక్షకులను అడిగారు.