చరిత్రకారుడు బాబాసాహెబ్‌ పురందరే కన్నుమూత

ప్రముఖ చరిత్రకారుడు, రచయిత బాబాసాహెబ్ పురందరే కన్నుమూశారు. జూలై 29న 99వ పుట్టినరోజు జరుపుకున్న ఆయన.. గత శనివారం బాత్‌రూంలో జారిపడ్డారు. దీంతో పుణెలోని దీననాథ్ మంగేష్కర్ దవాఖాన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో సోమవారం ఉదయం 5.07 గంటలకు తుదిశ్వాస విడిచారు. పుణేలోని వైకుంఠ శ్మశాన వాటికలో ఇవాళ ఉదయం 10.30 గంటలకు పురందరే అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

చరిత్రకారుడు, రచయిత అయిన పురందరే నారాయణ్‌ రావ్‌ పీశ్వా, కేసరి, రాజా శివ్‌ఛత్రపతి, షెలార్క్‌హింద్‌, దౌలత్‌, నౌబత్‌ వంటి అనేక నవలలు రాశారు. శివాజీ కాలం నుంచి రాజు, అతని పరిపాలన, కోటలపై పలు పుస్తకాలు రాశారు. అయితే ఛత్రపతి శివాజీ మహారాజ్‌పై రాసిన ‘జనతా రాజ్’ నాటకంతో ప్రసిద్ధి చెందారు. ఆ నటకానికి దర్శకత్వం కూడా వహించారు. రాజా శివ్‌ఛత్రపతి నవల 16 ఎడిషన్లు పబ్లిష్‌ అయ్యాయి. 5 లక్షలకుపైగా ప్రతులు అమ్ముడుపోయాయి.

ఈ నాటకంను మహారాష్ట్ర, ఆగ్రా, ఢిల్లీ, భోపాల్, అమెరికాలతో పాటు మహారాష్ట్రలోని 16 జిల్లాలలో 1,000 సార్లు ప్రదర్శించారు. 200 మందికి పైగా కళాకారులు ఈ ప్రదర్శనలలో పాల్గొన్నారు. పురందరే సేవలకుగాను మహారాష్ట్ర ప్రభుత్వం 2015లో ‘మహారాష్ట్ర భూషణ్’ అవార్డును ప్రదానం చేసింది. 2019లో భారతదేశపు రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్‌ అందుకున్నారు.

పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతకు ప్రధాని నరేంద్ర మోదీ సహా దేశవ్యాప్తంగా పలువురు నేతలు నివాళులర్పించారు. బాబాసాహెబ్ పురందరే మృతి పట్ల ప్రధాని మోదీ ట్విట్టర్‌లో స్పందిస్తూ “నేను మాటల్లో చెప్పలేనంతగా బాధపడ్డాను. పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతకు ప్రధాని నరేంద్ర మోదీ సహా దేశవ్యాప్తంగా పలువురు నేతలు నివాళులర్పించారు. బాబాసాహెబ్ పురందరే మృతి పట్ల ప్రధాని మోదీ ట్విట్టర్‌లో స్పందిస్తూ “నేను మాటల్లో చెప్పలేనంతగా బాధపడ్డాను” అని పేర్కొన్నారు.

నాటక రంగానికి ఆయన చేసిన కృషికి గాను 2007-08 సంవత్సరానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం కాళిదాస్ సమ్మాన్‌ను కూడా  అందించింది.
ముఖ్యంగా, బాబాసాహెబ్ పురందరే తన శత జయంతి సంవత్సరాన్ని పురస్కరించుకుని జరిగిన సన్మాన కార్యక్రమంలో మాట్లాడుతూ, ప్రజలు తనపై కురిపించిన  ప్రేమను చూసి మళ్లీ మహారాష్ట్రలో జన్మించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

‘‘నా తండ్రి వల్లే శివాజీ మహారాజ్ చరిత్ర వైపు ఆకర్షితుడయ్యాను.. అభిరుచిని పెంచుకోవడంలో నా స్నేహితులు సహకరించారు. చరిత్రపై మక్కువ ఉంటే తప్ప చరిత్ర నేర్చుకోలేరు. శివాజీ చరిత్రను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నేనేం చేశాను? ఈ అభిరుచి కారణంగా ఇది చాలా తేలికగా జరిగింది” అని తెలిపారు. 

“నేను ఛత్రపతి శివాజీ మహారాజ్‌కు అమితమైన ఆరాధకుడను. ఆయన తెలివితేటలు, పనితనం,  పరాక్రమం నన్ను ఎప్పుడూ ఆశ్చర్యపరిచాయి. స్వరాజ్యం కోసం ఆయన చేసిన ప్రయత్నాలు చాలా ముఖ్యమైనవి” అని బాబాసాహెబ్ పురందరే చెప్పారు. “జీవితాన్ని తెలివిగా,  తేలికగా తీసుకోవడం ద్వారా గడపాలి. మనం ఇతరులకు ఎలాంటి ద్వేషం, అసూయ లేకుండా ప్రేమను పంచాలి” అని ఈ సందర్భంగా సూచించారు.