ధ్యాన్‌చంద్‌ అవార్డు అందుకున్న నీరజ్, మిథాలీ 

భారత అత్యున్నత క్రీడాపురస్కారమైన ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న అవార్డును ఒలిపింక్స్‌ బంగారు పతక విజేత నీరజ్‌ చోప్రా, మహిళా క్రికెటర్‌ మిథాలీరాజ్‌ రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ నుంచి శనివారం రాష్ట్రపతి భవన్ లో అందుకున్నారు. 
 
ఈ ఏడాది 12 మందిని ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న పురస్కారాలు వరించగా.. నీరజ్‌చోప్రా, మిథాలీరాజ్‌తో పాటు రవికుమార్‌ దహియా (రెజ్లర్‌), లవ్లీనా బోర్గోహైన్ (బాక్సింగ్), శ్రీజేశ్‌ పీఆర్ (హాకీ), అవని లేఖా (పారా షూటింగ్), సుమిత్ యాంటిల్ (పారా-అథ్లెటిక్స్), ప్రమోద్ భగత్ (పారా బ్యాడ్మింటన్), కృష్ణ నగార్ (పారా బ్యాడ్మింటన్), మనీష్ నర్వాల్ (పారా షూటింగ్), సునీల్ ఛెత్రి (ఫుట్‌బాల్), మన్‌ప్రీత్ సింగ్ (హాకీ) ఖేల్‌రత్న పురస్కారాన్ని రాష్ట్రపతి నుంచి అందుకున్నారు. 
 
వీరిలో షట్లర్‌ కృష్ణ నగార్‌ తల్లి ఆకస్మికంగా మృతి చెందడంతో కార్యక్రమానికి హాజరు కాలేదు. క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌తో పాటు 35 మంది అర్జున అవార్డులను అందుకున్నారు.
 
వీరిలో  అర్పిందర్ సింగ్, సిమ్రంజిత్ కౌర్, భవానీ దేవి, మోనికా, వందనా కటారియా, సందీప్ నర్వాల్, హిమాని ఉత్తమ్ పరబ్, అభిషేక్ వర్మ, అంకిత రైనా, దీపక్ పునియా, దిల్‌ప్రీత్ సింగ్, హర్మన్ ప్రీత్ సింగ్, రూపిందర్ పాల్ సింగ్, సురేందర్ కుమార్, అమిత్ రోహిదాస్, బీరేంద్ర లక్రా, సుమిత్, నీలకంఠ శర్మ, హర్దిక్‌ సింగ్‌, వివేక్ సాగర్ ప్రసాద్, గుర్జంత్ సింగ్, మన్దీప్ సింగ్, షంషేర్ సింగ్, లలిత్ కుమార్ ఉపాధ్యాయ్, వరుణ్ కుమార్, సిమ్రంజీత్ సింగ్, యోగేష్ కథునియా, నిషాద్ కుమార్, ప్రవీణ్ కుమార్, సుహాష్ యతిరాజ్, సింగ్‌రాజ్ అధానా, భావినా పటేల్, హర్విందర్ సింగ్, శరద్ కుమార్‌ అర్జున అవార్డును అందుకున్నారు.

అలాగే లైఫ్‌టైమ్‌ కేటగిరిలో ద్రోణాచార్య అవార్డు టీపీ ఔసేఫ్‌, సర్కార్‌ తల్వార్‌, సర్పాల్‌ సింగ్‌, అషన్‌కుమార్‌, తపన్‌ కుమార్‌ పాణిగ్రాహి అందుకున్నారు. రెగ్యులర్‌ విభాగంలో ద్రోణాచార్య అవార్డును రాధాకృష్ణన్ నాయర్ పీ, సంధ్యా గురుంగ్, ప్రీతమ్ సివాచ్, జై ప్రకాష్ నౌటియల్, సుబ్రమణియన్‌ రామన్‌ అం దుకున్నారు. లైఫ్‌టైమ్‌ అవీచ్‌మెంట్‌ కేటగిరిలో కేసీ లేఖ, అభిజీత్‌ కుంటే, దేవిందర్‌ సింగ్‌ గార్చా, వికాస్‌ కుమార్‌, సజ్జన్‌ సింగ్‌ ద్రోణాచార్య అవార్డులను రాష్ట్రపతి నుంచి అందుకున్నారు.