చర్చిలో 19మంది అమ్మాయిల జీవితాలతో క్రూరక్రీడ

చర్చిలో పియానో వాయిస్తూ, పెండ్లి చేసుకుంటానని మాయమాటలతో ప్రేమ, పెళ్లిల పేరిట యువతుల్ని లోబర్చుకోవడం, డబ్బులు దండుకొని వదిలేయడం, ఇదేమిటని ప్రశ్నిస్తే ఏం చేసుకుంటావో చేసుకో నాకు లీడర్లు, పెద్ద పెద్ద వ్యక్తులతో పరిచయాలున్నాయని బెదిరించడం పరిపాటిగా మారిన నిత్య పెళ్లి కొడుకు గుట్టు రట్టైంది.

పోలీసుల ప్రాథమిక విచారణ మేరకే 19 మంది యువతుల్ని ట్రాప్‌లోకి దించి మోసం చేసిన ఘనుడి లోగుట్టు నల్లగొండ జిల్లా కేంద్రంలో మంగళవారం వెలుగుచూసింది. నల్లగొండ క్లాక్‌టవర్‌ సెంటర్‌లోని చర్చిలో తులకొప్పుల శామ్యూల్‌ విలియమ్స్‌ పియానో వాయిస్తూ పాటలు పాడుతుంటాడు. దాంతోపాటు వైఎంసీఏ స్వచ్ఛంద సంస్థనూ స్థాపించాడు.

 కుటుంబ కలహాలతో భర్తకు దూరంగా ఉంటున్న పట్టణంలోని శ్రీనివాస్‌నగర్‌కు చెందిన ఓ మహిళకు విలియమ్స్‌తో పరిచ యం ఏర్పడింది. అండగా ఉంటానని నమ్మించిన విలియమ్స్‌ ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం ఉద్యోగం ఇప్పిస్తానని చెప్తూ 9 ఏండ్లుగా ఆమెతోనే సహజీవనం చేస్తున్నాడు.

ఈ క్రమంలో ఇల్లు కట్టిస్తానని బాధితురాలి వద్ద రూ.20 లక్షలు తీసుకున్నాడు. ఇదిలావుండగా చర్చికి వచ్చే ఓ యువతికి వైఎంసీఏలో ఉద్యోగం ఇస్తానని లోబర్చుకుని ఆరు నెలలుగా ఆమెతో ఉంటున్నాడు. గత నెల 25న ఆమెను వివాహం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న శ్రీనివాస్‌నగర్‌కు చెందిన మహిళ గత నెల 31న విలియమ్స్‌ను నిలదీసింది. 

ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఆమెపై కత్తితో దాడికి యత్నించాడు. తప్పిం చు కున్న ఆమె డయల్‌ 100కు ఫోన్‌ చేసింది. పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. వెనుక నుంచి గోడ దూకి పారిపోయాడు. మరుసటి రోజు పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకునేందుకు అంగీకరించి, వాయిదాలు వేస్తుండటంతో ఈనెల 5న బాధితురాలు వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యా దు చేసింది. 

పోలీసుల విచారణలో విలియమ్స్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నల్లగొండ ఉమ్మడి జిల్లాతోపాటు విదేశాల్లోని పలువురు మహిళలతో నిందితుడికి సంబంధాలున్నట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

గోవా, ఇతర ప్రాంతాల్లో అమ్మాయిలతో తిరిగే విలియమ్స్ ట్రాప్‌లో పడి అనేక మంది యువతులు మోసం పోయినట్లు చెబుతున్నారు. చర్చీ కార్యాక్రమాలతో పాటు వివిద రాజకీయ పార్టీల నాయకులను ప్రసన్నం చేసుకునేందుకు ప్లెక్సీలు పెట్టడం, వివిద కార్యక్రమాలు నిర్వహించి నాయకులు, అధికారులు, పెద్ద పెద్ద వ్యక్తులతో పరిచయాలు పెంచుకునే వాడు.

పియానో వాయిస్తూ శిక్షణ ఇస్తామని కొందరిని ఆకర్శించి లోబర్చుకున్న సంఘటనలున్నాయని చెబుతున్నారు. వివిద రాజకీయ పార్టీల నాయకులు, అధికారులు, ఇతర ప్రముఖ వ్యక్తులతో ఆయా సంబదర్భాల్లో దిగిన పోటోలు, వీడియోలను చూపించి తను వాడుకుని వదిలించుకోవాలనుకున్న యువతుల్ని బెదిరించే వాడని చెబుతున్నారు.

వృత్తి రిత్యా చిట్యాల మండలంలోని వెల్మినేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాక్ అసిస్టెంట్‌గా పనిచేసేవాడు. డిప్యూటేషన్ పేరిట నార్కట్‌పల్లి పిహెచ్‌సీలో పనిచేస్తున్న విలియమ్స్ ఏనాడూ కూడా విధుల్లోకి వెళ్లేవాడు కాదని సమాచారం. తనపై పోలీసులకు పిర్యాదు చేసిన విషయాన్ని గమనించిన విలియమ్స్‌ను తానే ఎస్సీ ఆఫీసుకు వచ్చి తాను ప్రేమించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లుగా డ్రామాలాడాడు.

అసలు విషయం తెలుసుకున్న పోలీసులు కూపీ లాగి అరెస్గు చేసేందుకు ప్రయత్నించగా తనకు గుండెపోటు వచ్చినట్లు హైడ్రామా సృష్టించాడు. ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చేరి హంగామా చేశాడు. దీంతో పోలీసులు అతన్ని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పరీక్షలు చేయించగా ఏలాంటి ఆరోగ్య సమ్యలు లేవని తేలింది.

అతనిపై వివిద రకాల మోసాలకు పాల్పడినందుకు గాను హత్యాచారం, ఇష్టంలేకుండా అనుభవించడం, డబ్బులు తీసుకుని మోసగించడం, చీటింగ్ చేసినందుకు గాను విలియమ్స్‌పై ఐపీసీ 376, ,377, 380,420, 442 ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చారు. కోర్టు రిమాండ్ విధించడంతో నల్గొండ జిల్లా జైలుకు తరలించారు.