వీర్ సావర్కర్ పై దాడి అసలు లక్ష్యం భారత జాతీయవాదం

వినాయక్ దామోదర్ సావర్కర్‌ను లక్ష్యంగా చేసుకొని, ఆయనను అపఖ్యాతిపాలు చేయడానికి ఉద్దేశపూర్వక ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొంటూ  అయితే అటువంటి ప్రయత్నాల  ‘నిజమైన లక్ష్యం ఒక వ్యక్తి కాదని, భారతీయ జాతీయవాదం అని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సర్ సంఘ్ చాలక్ డా. మోహన్ భగవత్ స్పష్టం చేశారు.

ఉదయ్ మహూర్కర్, చిరాయు పండిట్  రచన ‘వీర్ సావర్కర్ – విభజనను నిరోధించగలిగిన వ్యక్తి’ గ్రంధాన్ని ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ తో కలసి ఆవిష్కరిస్తూ ఆనాటి పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని హిందూత్వ గురించి వివరించడం అవసరమని సావర్కర్ భావించారని తెలిపారు.

“చాలా సంవత్సరాల తర్వాత, ఇప్పుడు మనం పరిస్థితిని చూసినప్పుడు, గట్టిగా మాట్లాడవలసిన అవసరం ఉందని గుర్తుకు వస్తుంది. ఆనాడు అందరూ ఆవిధంగా మాట్లాడి ఉంటే బహుశా విభజన జరిగి ఉండదు,” అని ఆయన చెప్పారు.

మోహన్ భగవత్ దివంగత ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతకర్త పి పరమేశ్వరన్‌ను ఉదహరిస్తూ సావర్కర్‌ని అప్రదిష్టపాలు చేసిన తర్వాత అటువంటి శక్తుల తదుపరి లక్ష్యాలు స్వామి దయానంద్ సరస్వతి, స్వామి వివేకానంద,  యోగి అరవింద్ అని తెలిపారు. భారత జాతీయవాదం అగ్రశ్రేణి సాధకురాలిన వారందరి ఆలోచనలు సావర్కర్ నుండి ప్రేరణ పొందాయని పేర్కొన్నారు. 

వీర్ సావర్కర్‌ని అప్రదిష్ట కావించేందుకు ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నాలను పేర్కొంటూ భగవత్, “నిజమైన లక్ష్యం ఒక వ్యక్తి కాదు, భారత జాతీయత. కాబట్టి, అందరూ ఐక్యంగా ఉంటే, చాలామంది తమ ఉనికిని కోల్పోతారు” అని చెప్పారు.

 “మన మాతృభూమిని ఐక్యంగా ఉంచడం మన బాధ్యత. చివరికి అఖండ భారత్ ఏర్పడుతుందని యోగి అరవింద్ చెప్పారు. రామ్ మనోహర్ లోహియా కూడా అఖండ భారత్ గురించి కలలు కన్నారు” అని పేర్కొంటూ  హిందూతత్వాన్ని ఐక్యత శక్తిగా డా. భగవత్ స్పష్టం చేశారు. తమ మనుగడకు,  దేశ సంపదను దోచుకోవడానికి “విభజించి పాలించడం” అవసరమనే ఆలోచన బ్రిటిష్ వారికి ఉందని చెబుతూ  “సావర్కర్ అండమాన్ జైలులో పొందిన అనుభవం ఇది” అని ఆయన చెప్పారు.

 మహాత్మా గాంధీ,  సావర్కర్ ల మధ్య భేదాభిప్రాయబేధాలు ఉన్నప్పటికీ వారిద్దరూ దేశంకోసం అంకితమైన సైనికుల్ని, ఒకరి ఆరోగ్యం గురించి  మరొకరు ఆందోళన చెందారని గుర్తు చేశారు. దీనిని అర్ధం చేసుకోలేనివారు ఇప్పటికి దుష్ప్రచారం సాగిస్తున్నారని మండిపడ్డారు. 

హిందూత్వం భావన ఒకటే అని, అది చివరి వరకు అలాగే ఉంటుందని చెబుతూ భారతదేశంలో నివసించే వారందరి పూర్వీకులు వారి కుల, మతాలకు అతీతంగా ఒకేలా ఉంటారని స్పష్టం చేశారు. భారతదేశంలో నివసిస్తున్న ప్రజలందరూ హిందువులని, ఇక్కడ హిందూమతం అర్థాన్ని జోడించడం చాలా విస్తృతమని ఆయన తెలిపారు.

మైనారిటీ అనే పదాన్ని ఉపయోగించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన మోహన్ భగవత్, మైనారిటీ అనేదేమీ లేదని చెప్పారు. “మనం  ఒకటే, మనం ఒకే సంస్కృతికి వారసులం. విభిన్న ఆచారాలు, భాషలు ఉన్నప్పటికీ. ఎవ్వరిని సంతుష్టపరచడం అంటూ లేదు. అందరి సంక్షేమం కోరతాము. ప్రతి ఒక్కరికీ హక్కులు ఉన్నాయి, అలాగే విధులు కూడా ఉన్నాయి,” అని భగవత్ వివరించారు. .

మోహన్ భగవత్ ఇంకా మాట్లాడుతూ సావర్కర్ దేనినీ గుడ్డిగా అంగీకరించలేదని పేర్కొంటూ “ఆయన ముస్లింలను ద్వేషించలేదు. ఆయనకు ఉర్దూ కూడా తెలుసు.  ప్రజాస్వామ్యంలో అనేక ఆలోచనలు ఉన్నాయి. సావర్కర్ ఆలోచనల ఔదార్యం గురించి  తెలియని వారు ఆయనకు అప్రదిష్ట కలిగిన్చే ప్రయత్నం చేస్తున్నారు. దేశానికి గాంధీజీ అవసరమని సావర్కర్ ఒక ప్రకటన ఇచ్చారు” అని గుర్తు చేశారు. 

“గాంధీజీ ఆయన ఆరోగ్యాన్ని గురించి ఆందోళన చెందారు. ఎందుకనే దేశానికి సావర్కర్ అవసరం అని చెప్పారు. అంబేద్కర్,  గాంధీజీ అందరూ ఆయనను ప్రశంసించారు. కానీ సంకుచిత ధోరణి గల వ్యక్తులే సావర్కర్ గురించి పనికిమాలిన విషయాలు తీసుకువస్తున్నారు” అంటూ విచారం వ్యక్తం చేశారు.  మరియు ఖండించారు.

క్షమాబిక్ష పిటీషన్ పెట్టమన్నది గాంధీ 

సావర్కర్‌పై చాలా అబద్ధాలు వ్యాపింపచేస్తున్నారని పేర్కొంటూ ఆయన అతను బ్రిటిష్ ప్రభుత్వం ముందు బహుళ క్షమాభిక్ష పిటిషన్లు దాఖలు చేశాడని పదేపదే ప్రస్తావిస్తున్నారని రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ గుర్తు చేశారు. తన విడుదల కోసం సావర్కర్ తన విడుదల కోసం ఈ పిటిషన్లను దాఖలు చేయలేదని స్పష్టం చేశారు.

సాధారణంగా ఖైదీకి క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేసే హక్కు ఉంటుంది.  క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేయమని ఆయనను  మహాత్మా గాంధీ కోరారని చెప్పారు. గాంధీ సూచన మేరకు ఆయన క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేశారని అంటూ మహాత్మా గాంధీ సావర్కర్ ని విడుదల చేయాలని విజ్ఞప్తి కూడా చేశారని తెలిపారు.

సావర్కర్ వాస్తవానికి బానిసత్వం సంకెళ్లను విచ్ఛిన్నం చేయడానికి ప్రజలను ప్రేరేపించారని,  మహిళల హక్కులతో సహా అనేక ఇతర సామాజిక సమస్యల మధ్య అస్పృశ్యతకు వ్యతిరేకంగా ఆందోళన చెందారని రాజనాథ్ పేర్కొన్నారు. అయితే, దేశ సాంస్కృతిక ఐక్యతలో ఆయన పాత్రను విస్మరిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు.

2003 లో సావర్కర్ చిత్రాన్ని పార్లమెంటులో ఉంచినప్పుడు చాలా రాజకీయ పార్టీలు బహిష్కరించారని గుర్తు చేశారు. ప్రభుత్వం మారినప్పుడు అండమాన్ ,  నికోబర్  జైలులో ఆయన పేరు మీద ఉన్న ఫలకంను తొలగించారని చెప్పారు. సావర్కర్ పై  కొందరు పెంచుకున్న ద్వేషాన్ని ఇవి తెలుపుతున్నాయని విమర్శించారు.

నాజీ లేదా ఫాసిస్ట్‌గా సావర్కర్ ను అభివర్ణించడం సరికాదని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. నిజం ఏమిటంటే ఆయన హిందుత్వను విశ్వసించారు . అయితే వాస్తవికవాది. ఐక్యతకు సంస్కృతి  ఏకరూపత ముఖ్యం అని ఆయన నమ్మారు. సావర్కర్ ఒక వ్యక్తి కాదు. ఒక  ఆలోచన. ఆయన అనుచరులు రోజురోజుకు దేశంలో పెరుగుతున్నారని రాజనాథ్ వివరించారు. 

కొత్త పుస్తకంలో, ఉదయ్ మహూర్కర్,  చిరాయు పండిట్ పాకిస్తాన్ ఏర్పడకుండా నిరోధించడానికి వినాయక్ దామోదర్ సావర్కర్ విజయవంతం కాని ప్రయత్నం గురించి వివరించారు.  సావర్కర్ పై చేస్తున్న అప్రదిష్ట కలిగించే ఆరోపణలలోని వాస్తవాలను సహితం వారు అందులో బహిర్గతం చేశారు. అటువంటి ఆరోపణల వెనుకనున్న ఉద్దేశ్యాలను వెల్లడించారు. 

మహూర్కర్ తన కొత్త పుస్తకంలో సావర్కర్‌ని ‘భారత దేశ భద్రతకు పితామహుడు’ అని పేర్కొన్నాడు.  అతని జాతీయవాద సిద్ధాంతం ‘ఓటు బ్యాంకు రాజకీయాల బలిపీఠం వద్ద త్యాగం చేయబడింది’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.