నాలుగు ఒప్పందాలపై భారత్, డేనిష్ ప్రధాని సంతకాలు

ప్రధాని నరేంద్ర మోదీతో మూడు రోజుల భారత్ పర్యటనకు వచ్చిన  డేనిష్ ప్రధాని మెట్టే ఫ్రెడరిక్సన్ శనివారంనాడు న్యూఢిల్లీలో సమావేశమ్యయారు. కీలక రంగాలైన ఆరోగ్యం, వ్యవసాయం, జల నిర్వహణ, వాతావరణ మార్పులు, పునరుత్పాదక ఇంధనం తదితర రంగాల్లో పరస్పర సహకారానికి ఫలప్రదమైన చర్యలు జరిపినట్టు ఇరుదేశాల ప్రధానులు సమావేశానంతరం సంయుక్తంగా ప్రకటించారు. 
 
శాస్త్ర, సాంకేతిక రంగం, వాతావరణ మార్పులు, నైపుణాభివృద్ధి వంటి రంగాల్లో మరింత సహకారానికి నాలుగు ఒప్పందాలపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. డెన్మార్క్‌ ప్రధాని మెటె ఫ్రెడెరిక్‌సెన్‌తో ఫలవంతమైన చర్చలు జరిగాయని భారత ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఇండో డెన్మార్క్‌ గ్రీన్‌ స్ట్రాటజిక్‌ భాగస్వామ్య పురోగతిని ఇరువురు నేతలు సమీక్షించారు.
తాజాగా నాలుగు అంశాలపై రెండు దేశాల మధ్య ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. గ్రీన్‌ టెక్‌పై శ్రద్ధపెడుతున్నందుకు మోదీని ఫ్రెడెరిక్‌సెన్‌ ప్రశంసించారు. ఆయన ప్రపంచానికే ఆదర్శమని కొనియాడారు. పర్యావరణం– పురోగతి జంటగా ఎలా పయనిస్తాయో తమ భాగస్వామ్యమే ఉదాహరణ పేర్కొన్నారు. ఈ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తామని చెప్పారు.

వివిధ రంగాల్లో సమగ్ర సహకారాన్ని మరింత విస్తృతం చేసేందుకు చర్చలు సాగించామని మోడీ మోదీ మీడియా సంయుక్త సమావేశంలో తెలిపారు. సరిగ్గా ఏడాది క్రితం ఇదేరోజు జరిపిన వర్చువల్ సమ్మిట్‌లో ఇండియా, డెన్మార్క్ మధ్య గ్రీన్ స్ర్టాటజిక్ పార్టనర్‌షిప్ ఏర్పాటుకు చారిత్రక నిర్ణయం తీసుకున్నామని గుర్తు చేశారు.

పర్యావరణం పట్ల ఇరుదేశాలకు ఉన్న ఆలోచనా దృక్పథం, చిత్తశుద్ధిని, గౌరవాన్ని ఇది చాటుతుందని చెప్పారు. పునరుత్పాద ఇంధనం, పర్యవారణం, ఎకానమీ, వాతావరణ మార్పు, శాస్త్ర-సాంకేతిక రంగాల్లో సహకార విస్తరణకు గ్రీన్ పార్టనర్‌షిప్ అద్దంపడుతుందని తెలిపారు. ఇరుదేశాల మధ్య చర్చలు ఫలప్రదమయ్యాయని చెప్పారు.

భారత్  వ్యవసాయ ఉత్పత్తుల పెగుదలకు సంబంధించిన సాగు రంగంలో సమర్ధవంతమైన సప్లయ్ చైన్, స్మార్ట్ వాటర్ రిసోర్సెస్ మేనేజిమెంట్, టెక్నాలజీ వంటి రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని ఇరుదేశాలు నిర్ణయించినట్టు తెలిపారు. 

గ్రీన్ గ్రోత్, గ్రీన్ ట్రాన్సిషన్ ఏవిధంగా కలిసికట్టుగా ముందుకు సాగాలనే దానికి ఇండియా-డెన్మార్ మధ్య సహకారం గొప్ప ఉదాహరణ అని ఫ్రెడరిక్స పేర్కొన్నారు. ముఖ్యంగా ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో పరస్పర సహకారం పెంచుకునేందుకు ఉభయదేశాలు నిర్ణయించినట్టు చెప్పారు. రాష్ట్రపతి భవన్ వద్ద ఆమెకు ప్రధాని మోదీ స్వాగతం పలికారు. అనంతరం డేనిష్ ప్రధాని రాజ్‌ఘాట్ సందర్శించి మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. భారత్ తో డెన్మార్క్‌కు బలమైన వాణిజ్య, పెట్టుబడుల సంబంధాలు ఉన్నాయి. భారత్ లో 200కు పైగా డేనిష్ కంపెనీలు ఉండగా, డెన్మార్క్‌కు 60కి పైగా భారతీయ కంపెనీలు ఉన్నాయి.