యుపి ఎన్నికలలో కీలకంగా మారుతున్న `అయోధ్య’

బాబ్రీ మసీదు కేసులో తీర్పు తర్వాత మొదటి సారిగా ఉత్తర ప్రదేశ్ లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలలో ప్రధాన రాజకీయ పార్టీల ప్రచారం అయోధ్య చుట్టూ పరిభ్రమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పైగా ఇక్కడి నుండే తమ ప్రచారాన్ని వివిధ పార్టీలు ప్రారంభించే సూచనలు వ్యక్తం అవుతున్నాయి. 
 
వివాదాస్పద స్థలంలో రామ మందిరం నిర్మాణానికి మార్గం సుగమం చేస్తూ సుప్రీంకోర్టు నవంబర్ 6, 2019న ఇచ్చిన తీర్పు కీలకమైన ఎన్నికలకు ముందు అయోధ్య సమస్యను తిరిగి ప్రధాన అంశంగా మారుస్తుంది. బిజెపి, ఎస్‌పి బిఎస్‌పి సహా ప్రధాన రాజకీయ పార్టీలు 2022 ఎన్నికలకు తమ ప్రచారాలను ప్రారంభించడానికి అయోధ్యను ఉపయోగిస్తున్నాయి.
కొత్తగా ఎన్నికల రంగంలోకి దిగుతున్న అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎఐఎంఐఎంఎం కుండ ఎమ్మెల్యే (స్వతంత్ర) రఘురాజ్ ప్రతాప్ సింగ్ అలియాస్ రాజా భయ్యా నేతృత్వంలోని జనసత్తా లోకంత్రీక్ దళ్‌తో సహా చిన్న పార్టీలు కూడా ఈ నగరాన్ని ప్రచారానికి ఉపయోగిస్తున్నాయి. 
 
అసదుద్దీన్ ఒవైసీ సెప్టెంబర్ 7 న అయోధ్యలోని రాసులాబాద్‌లో బహిరంగ సభతో తన పార్టీ ప్రచారాన్ని ప్రారంభించారు. ధన్నీపూర్ సమీపంలో ఉన్నందున సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం మసీదు వస్తున్నందున వేదికను వ్యూహాత్మకంగా ఎంచుకున్నారు. అయోధ్య అసెంబ్లీ నియోజకవర్గంకు ప్రస్తుతం బిజెపి వేద్ ప్రకాష్ గుప్తా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా 5 ఆగస్టు 2020 న ఒక గొప్ప దేవాలయం కోసం ‘భూమి పూజ’ చేయడంతో పాటు, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తరచుగా పవిత్ర పట్టణాన్ని సందర్శిస్తుండటంతో, ఈ అంశం యుపి రాజకీయాలలో సజీవంగా కొనసాగుతున్నది. ఈ సంవత్సరం దీపావళి సందర్భంగా జరిగే దీపోత్సవ్ లో కూడా ప్రధాని పాల్గొనబోతున్నారు.

సెప్టెంబర్ 5 న బిజెపి  ‘ప్రబుద్ సమ్మేళన్’ (మేధావుల సమావేశం) ను అయోధ్య నుండి రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ ప్రారంభించారు. 1966 లో పార్లమెంటు వద్ద సమావేశమైన సాధువులపై కాల్పులు జరపాలని మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఆదేశించారని, 1990 లో సమాజ్‌వాది పార్టీ అయోధ్యలో రాముడి భక్తులపై కాల్పులు జరపాలని ఉత్తర్వులివ్వడాన్ని యూపీ బీజేపీ అధ్యక్షుడు ఈ సందర్భంగా గుర్తు చేశారు. 

 
“ఈ బుల్లెట్లు భారతదేశపు సంస్కృతి, జాతీయవాదం ప్రయోగించినవి. భారతదేశమంతా రాముడిపై తన విశ్వాసాన్ని తిరిగి పొందుతుంది, ”అని సింగ్ భరోసా వ్యక్తం చేశారు. 
 
“1989 లో అయోధ్యలో రామ మందిరం నిర్మించాలని తీర్మానం చేసిన తర్వాత, ఆలయ పట్టణం ఎల్లప్పుడూ మాకు దగ్గరగా ఉంటున్నది. మాకు, రాముడు, రామ మందిరం విశ్వాసానికి సంబంధించినవి. అవి మాకు ముఖ్యమైనవిగా కొనసాగుతాయి. మేము దీనిని ఎన్నికల కోణం నుండి చూడలేదు” అని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి మనీష్ శుక్ల స్పష్టం చేశారు.

మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ తన ‘దళితులు-బ్రాహ్మణుల’ సూత్రాన్ని ఉపయోగించడం ద్వారా 2007 లభించిన విజయాన్ని పునరావృతం చేయాలని భావించి, జూలై 23 న అయోధ్య నుండి ‘బ్రాహ్మణ సమ్మేళనం’ ప్రారంభించింది.

జూలై 23 న, రాజ్యసభ ఎంపీ, బిఎస్‌పి అధిపతి మాయావతి సన్నిహితుడు సతీష్ చంద్ర మిశ్రా అయోధ్యలోని రామ జన్మభూమిలో ప్రార్థనలు చేయడం ద్వారా బ్రాహ్మణ ఓటర్లను ఆకర్షించడానికి పార్టీ ప్రచారాన్ని ప్రారంభించారు. బిజెపిపై దాడి చేస్తూ, గత మూడు దశాబ్దాలలో రామ మందిరం పేరిట సేకరించిన విరాళాల గురించి తెలియజేయాలని పాలక పక్షాన్ని మిశ్రా కోరారు.

సమాజ్‌వాది పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ తన  తండ్రి ములాయం సింగ్ యాదవ్ పాలనలో 16 వ శతాబ్దపు బాబ్రీ మసీదును ధ్వంసం కావడానికి దారితీసిన కరసేవకులపై పోలీసు కాల్పులకు ఆదేశించినందుకు ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించారు. “ప్రతి ఎన్నికలలో అయోధ్య కార్డు ఆడుతున్నందుకు”  బిజెపిపై  దాడి చేశారు.

“మేము తక్కువ హిందువులం కాదు. నేతాజీ (ములాయం సింగ్ యాదవ్) నిజానికి  చిన్నప్పటి నుండి హనుమంతుడి శిష్యుడు” అంటూ .అఖిలేష్ యాదవ్ ఇటీవల లక్నోలో జరిగిన ఒక టీవీ కార్యక్రమంలో తెలిపారు. నిర్మాణంలో ఉన్న రామాలయాన్ని ప్రజల కోసం తెరిచిన తర్వాత తన కుటుంబంతో సందర్శిస్తానని కూడా ప్రకటించారు.

ఎన్నికల ప్రచారంపై అయోధ్యను అఖిలేష్ పార్టీ కూడా ఉపయోగించుకొంటున్నది. సెప్టెంబర్ 3 న ‘ఖేత్ బచావో, రోజ్‌గార్ బచావో’ అనే పార్టీ కార్యక్రమంను రాష్ట్ర శాఖ అధ్యక్షుడు నరేష్ ఉత్తమ్ అయోధ్య నుంచే ప్రారంభించారు.  పార్టీ అయోధ్యకు ఎంత ప్రాముఖ్యత ఇస్తుందో అడిగినప్పుడు, ఎస్పీ అధికార ప్రతినిధి జుహీ సింగ్, “ఇది మాకు ముఖ్యమైన ప్రదేశం. మా పార్టీ యూపీ అధ్యక్షుడు  నరేష్ ఉత్తమ్ చేపట్టిన యాత్రలో ఇది ప్రధాన మజిలీ. 2012 లో, ఎస్పీ అయోధ్య అసెంబ్లీ నియోజకవర్గంలో గెలిచింది” అంటూ వివరించారు.

ఎస్‌పి అధికారంలో ఉన్నప్పుడు అయోధ్య అభివృద్ధికి పెద్ద ప్యాకేజీని ఇచ్చిన్నట్లు చెబుతూ 16-కోసి పరిక్రమ, రామాయణానికి అనుగుణంగా చెట్ల పెంపకం, మ్యూజియం ఏర్పాటు, ఘాట్లు, వివిధ తీర్ధయాత్ర ప్రదేశాల సుందరీకరణ జరిపినట్లు తెలిపారు.  పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే మార్గంలో అయోధ్యను చేరుస్తు ఎస్‌పి పాలనలోనే మార్పు చేసిన్నట్లు గుర్తు చేశారు.