
మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బీజేపీలో చేరడానికి పార్టీలోని ముఖ్యనేతలతో సహా అందరు సానుకూలంగా ఉన్నారని పేర్కొంటూ
నియంతృత్వ పాలనను ఎదుర్కోవటానికే ఈటెల వంటి వారు చేరి పార్టీని బలోపేతం చేస్తున్నామన్నారని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి చెప్పారు.
ఈటల రాజేందర్ ఢిల్లీలో బిజెపి అధ్యక్షుడు జేపీ నడ్డాను కలుస్తారని చెబుతూ, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, తనతో చర్చించిన తర్వాతే ఈటల ఢిల్లీ వెళ్ళారని పేర్కొన్నారు. బిజెపిని . బలోపేతానికి అందరూ సహకరించాలని కోరారు. అసంతృప్తులు సహజమని అంటూ సీనియర్ నేత పెద్దిరెడ్డి అసంతృప్తిని పార్టీలో చర్చిస్తామని తెలిపారు.
అంతర్గత అంశాలు బయటకు చెప్పాల్సిన అవసరం లేదని, పెద్దిరెడ్డి తనను విమర్శించినంత మాత్రానా తాను స్పందించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కేసీఆర్‌కు మంచిని.. మోదీకి చెడును ఆపాదించటం టీఆర్ఎస్ నేతలకు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు.
కాగా, కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల బాధ్యత కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుందని కిషన్‌రెడ్డి తెలిపారు. వారికి చదువు, ఆరోగ్యానికి అయ్యే ఖర్చు అంతా కేంద్రమే భరిస్తుందని స్పష్టం చేశారు. సేవా హీ సంఘటనలో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గంలోని ఆశా వర్కర్లు, జీహెచ్ఎంసీ కార్మికులకు నిత్యావసర వస్తువులు కిషన్ రెడ్డి పంపిణీ చేశారు.
ప్రజలు లాక్‌డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తూ లాక్ డౌన్ సడలింపు అంశం ప్రభుత్వ పరిధిలోనిదని స్పష్టం చేశారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు సమయాన్ని పెంచడంతో పెద్ద ఎత్తున ప్రజలు రోడ్ల మీదకొస్తున్నారని పేర్కొంటూ అనవసరంగా రోడ్ల మీదకు వచ్చి ప్రజలు కరోనా బారిన పడొద్దని సూచించారు.
దేశంలో కరోనా తగ్గుముఖం పడ్తున్న సమయంలో జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్స్ ఖాళీగా ఉన్నాయని అంటూ కరోనా చికిత్సకు అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆసుపత్రులపై నియంత్రణ రాష్ట్ర ప్రభుత్వానిదే అని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి