భారత్ కు సాయంలో జర్మనీ సైన్యం 

క‌రోనా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న భారత్కు  అత్య‌వ‌స‌రంగా సాయం అందించ‌డానికి జ‌ర్మ‌నీ త‌న ఆర్మీని రంగంలోకి దింపింది. ఆ దేశానికి చెందిన క‌ల్న‌ల్ డాక్ట‌ర్ థార్‌స్టెన్ వెబెర్ ఓ ఆక్సిజ‌న్ జ‌న‌రేష‌న్ ప్లాంట్ తీసుకొని ఇండియాకు వ‌స్తున్నారు. ఆయ‌న‌తోపాటు ఓ టెక్నిక‌ల్ టీమ్ కూడా ఇండియా రానుంది.

ఈ ఆక్సిజ‌న్ జ‌న‌రేష‌న్ ప్లాంట్ ప‌ని చేయ‌డంలో ఇండియాలోకి టెక్నీషియ‌న్స్‌కు జ‌ర్మ‌న్ టెక్నీషియ‌న్లు సాయం చేయ‌నున్నారు. ఇండియాకు అవ‌స‌రం ఉన్న‌న్ని రోజులు ఈ ప్లాంట్ ఇక్క‌డే ఉంటుంద‌ని ఆయ‌న వెబెర్ స్ప‌ష్టం చేశారు.

ప్లాంట్‌తోపాటు మ‌రో 120 వెంటిలేట‌ర్లు కూడా జ‌ర్మ‌న్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్‌బ‌స్‌లో భారత్ వ‌స్తున్నాయి. శ‌నివారం రాత్రే ఇవి న్యూఢిల్లీలో ల్యాండ‌వ‌నున్నాయి. ఇవి భారత్లో దిగిన వెంట‌నే ఇక్క‌డి రెడ్‌క్రాస్ సొసైటీ, విదేశాంగ శాఖ సాయంతో అవ‌స‌ర‌మైన చోటికి పంపిణీ కూడా చేస్తామ‌ని భారత్ కు జ‌ర్మ‌నీ రాయ‌బారి వాల్ట‌ర్ లిండ్నెర్ చెప్పారు.

గ‌త వార‌మే భారత్ కు జ‌ర్మ‌నీ చాన్స్‌ల‌ర్ ఏంజెలా మెర్కిల్ సంఘీభావం తెలిపారు. భారత్తో జ‌ర్మ‌నీ ఎప్పుడూ స్నేహ‌పూర్వ‌కంగానే ఉంటుంద‌ని ఆ దేశ విదేశాంగ మంత్రి హైకో మాస్రు చెప్పారు. గురువారం ఆక్సిజ‌న్ కాన్సెంట్రేట‌ర్‌లతో ఉన్న తొలి కంసైన్‌మెంట్ జ‌ర్మ‌నీ నుంచి భారత్కు  వ‌చ్చింది.