ఢిల్లీ, యూపీ న‌గ‌రాల్లో లాక్ డౌన్

ఢిల్లీ న‌గ‌రం లాక్ డౌన్ లోకి వెళ్ల‌నుంది. ఈ రోజు రాత్రి 10 గంటలకు అమల్లోకి రానున్న లాక్ డౌన్ ఏప్రిల్ 26 ఉదయం 5 గంటల వరకూ కొనసాగుతుంది. ఈ మేర‌కు ఢిల్లీ ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.వారం రోజుల పాటు ఇది అమ‌లులో ఉండ‌బోతోంది.

మ‌రో వైపు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని ప్రయాగ్‌రాజ్, లక్నో, వారణాసి, కాన్పూర్ నగర్, గోరఖ్‌పూర్‌ నగరాల్లో లాక్‌డౌన్ చేయాల‌ని అక్క‌డ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. క‌రోనా క‌ట్ట‌డిలో క‌ఠిన చ‌ర్య‌లు అవ‌స‌రం అని ప్ర‌క‌టించింది. లాక్‌డౌన్ విధించనుండడంతో నగర వీధుల్లో గతేడాది దృశ్యాలు దర్శనమిస్తున్నాయి.

చాలా మంది న‌గ‌రాల ప్రజలు వైన్ షాపుల ముందు పెద్ద పెద్ద క్యూలు కట్టడం ప్రారంభించారు. గోలే మార్కెట్ ఏరియా, ఖాన్ మార్కెట్ల ప్రాంతాల్లో వైన్ షాపుల ముందు భారీ క్యూలల్లో ప్రజలు నిలబడి ఉన్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓవైపు సెకండ్ వేవ్ కొనసాగుతున్నా కూడా ప్రజలు కొవిడ్ నిబంధనలు తుంగలో తొక్కి మద్యం కోసం బారులు తీరారు.