మమతా వ్యతిరేక నినాదంగా మారిన `జై శ్రీరామ్’

సయ్యద్ ఫిరదౌసి అష్రాఫ్ 
ఎన్నికల ఫలితాన్ని ఊహించడం చాలా కష్టమైన ఆట. పైగా ఒక అలకు వ్యతిరేకంగా వెళుతుంటే మరింకా. భారతీయ జనతా పార్టీ రూపంలో  పెద్ద రాజకీయ ఉప్పెన ఉన్నప్పటికీ,  బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధిస్తుందని చాలా అభిప్రాయ సేకరణలు అంచనా వేస్తున్నాయి. రాజకీయ పరిశోధకుడు డాక్టర్ సజ్జన్ కుమార్ వేరే టేక్ తీసుకున్నారు

రాష్ట్రంలో బిజెపి స్పష్టమైన విజయాన్ని సాధిస్తుందని, మే 2న లెక్కింపు రోజున అందరూ ఆశ్చర్యపోతారని డాక్టర్ కుమార్ చెప్పారు.  జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుండి పొలిటికల్ సైన్స్‌లో పిహెచ్‌డి చేసి, ఇప్పుడు హైదరాబాద్‌కు చెందిన రాజకీయ, పరిశోధన సంస్థ పీపుల్స్ పల్స్‌తో సంబంధం కలిగి ఉన్న డాక్టర్ కుమార్ రీడిఫ్.కామ్ ప్రతినిధి  సయ్యద్ ఫిర్దాస్ అష్రాఫ్ తో  మాట్లాడుతూ, “హిందుత్వ బెంగాల్ లో ఆలస్యంగా ప్రవేశించింది. ఆధారం టిఎంసి వ్యతిరేకత అయితే, దాని పైన బిజెపి అనుకూల, హిందుత్వ సెంటిమెంట్ ఉంది” అని స్పష్టం చేశారు. ఆయన జరిపిన ఇంటర్వ్యూ లోని ప్రధాన అంశాలు:

బెంగాల్ ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధిస్తుందని అభిప్రాయ సేకరణలు చెబుతున్నాయి, అయితే మీరు మాత్రమే బిజెపి విజయం సాధిస్తారని అంచనా వేస్తున్నారు. మీ విశ్లేషణపై మీకు ఎందుకు అంత నమ్మకం ఉంది?

నేను రెండున్నర నెలలు సర్వే చేసి, డిసెంబర్ మొదటి వారంలో పూర్తి చేశాను. మొత్తం 294 నియోజకవర్గాలను సందర్శించాను. నేను కథన పద్ధతి ద్వారా క్షేత్ర అధ్యయనం చేస్తాను. ఒక నియోజకవర్గానికి వెళ్లేముందు, 2016 అసెంబ్లీ ఎన్నికలు, 2019 సార్వత్రిక ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల ఎన్నికలకు సంబంధించి కమిషన్ నుండి డేటాను చూడటం ద్వారా నేను పూర్వాపర్వాలపై అవగాహన ఏర్పర్చుకొంటాను. .

నేను ఆ ప్రాంతాలకు అందుబాటులో ఉన్న వార్తా నివేదికలు,  విద్యా సాహిత్యం ద్వారా కూడా  పరిశీలన చేస్తాను. నేను వ్యక్తిగతంగా ప్రతి నియోజకవర్గానికి వెళతాను. ఆ నియోజకవర్గంపై అవగాహన ఉన్న  స్థానిక నిపుణులను కలుస్తాను. అప్పుడు నేను భారతీయ జనతా పార్టీ, మార్కిస్ట్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ నాయకులు, ఇతర రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలను కలుస్తాను. ఆ తరువాత నేను రెండు విషయాలు సేకరిస్తున్నాను – వారి నియోజకవర్గం ఫలితం ఏ విధంగా ఉండగలదని వారనుకొంటున్నారు, అందుకు కారణాలు ఏమిటని వారి అభిప్రాయాలు తెలుసుకొంటాను. 

 
నిపుణుల నుండి అభిప్రాయ సేకరణ చేసిన వారు వారి విశ్లేషణ చూస్తే క్షేత్ర స్థాయిలో జరుగుతున్న మార్పును చదవడంలో విఫలం అవుతున్నట్లు గ్రహిస్తారు. 

క్షేత్ర స్థాయిలో ప్రజల మానసిక స్థితిని చదవడంలో నిపుణులు విఫలమైన సందర్భాలను సందర్భాలను నేను చూశాను, ముఖ్యంగా 2002 గుజరాత్ 2002అసెంబ్లీ ఎన్నికలలో.

ఈ నిపుణులు పాత మూస పద్ధతి ద్వారా వెడుతూ, సాధారణ ప్రజలను  కలవక పోతూ ఉండడం కారణంగా ఆ విధంగా జరుగుతూ ఉంటుంది.  నా పద్ధతిలో, నేను (ప్రతి) నియోజకవర్గం  జనాభా వివరాలను కూడా సేకరిస్తాను.

జనాభా లెక్కలు మీకు ఎస్సీ / ఎస్టీ, ముస్లిం జనాభా శాతాన్ని ఇస్తాయి, కాని ఇది ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మీకు నిజమైన కులం, సామజిక కూర్పును ఇవ్వదు. ఒకసారి మీరు దీని గురించి వాస్తవమైన చిత్రం పొందితే పరిస్థితి అర్ధం అవుతుంది. ఉదాహరణకు,  నేను నందిగ్రామ్ నియోజకవర్గానికి వెళ్ళితే ఎవరు గెలుస్తారని అడగను.  కానీ నేను డేటాను సేకరిస్తాను. 28 నుంచి 30 శాతం మంది ముస్లింలు, 10 శాతం మంది దళితులు, 10 శాతం మంది బ్రాహ్మణులు ఉన్నారు. ఈ విధంగా, ప్రతి నియోజకవర్గంలో కుల జనాభా కూర్పు నాకు లభిస్తుంది.

 
బెంగాల్‌లో 30 శాతం ముస్లిం జనాభా ఉందని, వారు బిజెపికి ఓటు వేయరని పరిశీలకులు అంటున్నారు. అదనంగా, ముస్లిమేతర ఓట్ల కోసం బిజెపి టిఎంసి, సిపిఐ-ఎం / కాంగ్రెస్ కూటమిపై పోరాడవలసి ఉంటుంది.

ఈ 30 శాతం ముస్లింలు పశ్చిమ బెంగాల్ లోని 294 సీట్లలో సమానంగా పంపిణీ కాలేదు. ఉదాహరణకు, ఇవి ప్రధానంగా పశ్చిమ బెంగాల్ లోని నాలుగు జిల్లాల్లో కేంద్రీకృతమై ఉన్నాయి – ఉత్తర దినాజ్‌పూర్, దక్షిణ మాల్డా, ముర్షిదాబాద్, బీభం భాగాలు,  దక్షిణ 24 పరగణాల భాగాలు.

పశ్చిమ బెంగాల్‌లోని 294 నియోజకవర్గాల్లో 60 నియోజకవర్గాల్లో మాత్రమే ముస్లింలు నిర్ణయాత్మకంగా ఉన్నారు. ఉదాహరణకు, భంగర్ నియోజకవర్గంలో 80 శాతం ముస్లింలు ఉన్నారు. ముర్షిదాబాద్‌లో 90 శాతం ముస్లింలు ఉన్నారు. కాబట్టి ముస్లింల ఈ 30 శాతం జనాభా 60 నుండి 65 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే నిర్ణయాత్మకమైనది.

ఊహజనితంగా, బిజెపికి 294 సీట్లలో 60 స్థానాలను తీసివేయండి.  అది 234 సీట్లకు వస్తుంది. కాబట్టి, ఈ 234 స్థానాల్లో టిఎంసికి వ్యతిరేకంగా కుల, వర్గాల అంశాలు ఏమిటి?

ఇప్పటికే హిందూ ఏకీకరణ ఉంది, కానీ కారణాలు ప్రతిచోటా హిందుత్వం కాదు. మీరు ఉత్తర బెంగాల్‌కు వెళతారు, అక్కడ అత్యంత ప్రాముఖ్యమైన సమాజం రాజవంశం దళితులు. వారు నిర్ణయాత్మకంగా బిజెపికి అనుకూలంగా ఉన్నారు. మీకు బిజెపి అనుకూల నామ శూద్ర వారున్నారు. అప్పుడు మీకు భద్రలోక్, వారిలో అత్యధికంగా బిజెపి వైపు ఉన్నారు. అయినా వారిలో కొందరు ఇప్పటికీ టిఎంసి వద్ద ఉన్నారు.

గూర్ఖాలు కొంత గందరగోళంలో ఉన్నారు, కాని 50-70 శాతం మంది బిజెపికి అనుకూలంగా ఉన్నారు. మీకు ముస్లిం కేంద్రీకృత నియోజకవర్గాలు అయిన మాల్డా, ముర్షిదాబాద్ ఉన్నాయి. ఇక్కడ ఒక వైపు ముస్లింలు ఉన్నారు. మరొక వైపు హిందువులు ఉన్నారు.  మీరు వెళ్లి వారితో మాట్లాడండి. వారి మధ్య విభజన భయంకరంగా ఉందని మీరు గ్రహిస్తారు.

 
మీరు బీరుభం, ఆసన్సోల్, పురులియా, పశ్చిమ ఘజ్నిపూర్, దుర్గాపూర్, చిత్రన్జన్లకు వెళ్లండి. పారిశ్రామిక జోన్ కారణంగా వచ్చి స్థిరపడిన హిందీ మాట్లాడే జనాభా లేదా మీకు గిరిజన లేదా దళిత ప్రాంతాలు ఉన్నాయి.  ఇక్కడ బిజెపి ప్రభంజనం కనిపిస్తుంది.  ఎందుకంటే ముస్లిం జనాభా అకస్మాత్తుగా 10 శాతం కంటే తక్కువకు పడిపోతుంది.

బిజెపి అభివృద్ధి ఎజెండా గురించి ఏమిటి? దానికి ఏదైనా స్పందన  ఉందా లేదా హిందూ ఏకీకరణ మాత్రమే ఉపయోగ పడుతుందా?

ఇది, అదని కాదు. ప్రధానంగా, బిజెపికి ఓటు టిఎంసి వ్యతిరేకత నుండి వస్తుంది. అక్కడి నుండే మొదలవుతుంది. ఇది బిజెపికి సానుకూల ఓటు కాకుండా టిఎంసికి వ్యతిరేకంగా ప్రతికూల ఓటు. సంక్షేమ పథకాల వల్ల బిజెపి అకస్మాత్తుగా ప్రాచుర్యం పొందలేదు.  ఎందుకంటే ఆ తర్కం ప్రకా రం టిఎంసి చేపట్టిన అనేక పథకాలు ఉన్నాయి.

కానీ అవినీతి స్థాయి చాలా ఎక్కువగా ఉంది. రోజువారీ వేతనం లేదా వ్యవసాయం (ఉపాధి కోసం) మినహా తయారీ లేదా సేవా రంగం లేని రాష్ట్రం బెంగాల్. ఆ సమాంతర ఆర్థిక వ్యవస్థలో అవినీతి కారణంగా వారు తమ డబ్బును కోల్పోయేటట్లు చేస్తే, అప్పుడు ఓటర్లలో ఊపిరాడని పరిస్థితి ఏర్పడుతుంది.

లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వానికి కూడా ఇదే జరిగింది

ఒక తేడా ఉంది. వామపక్షానికి అందుకు 34 సంవత్సరాలు పట్టింది. వామపక్ష పాలనలో, అవినీతికి చాలా మంది వాటాదారులు ఉన్నారు. స్థానిక ప్రజలు కూడా డబ్బు సంపాదించేవారు. అక్రమ రవాణా జరిగితే, అక్రమ మందుల వ్యాపారం లేదా బంగ్లాదేశ్‌కు ఆవు అక్రమ రవాణా వంటివి జరిగితే, ప్రతి ఒక్కరూ వాటా పొందేవారు.

ఇప్పుడు టిఎంసి వ్యక్తులకు మాత్రమే డబ్బు లభిస్తుంది. వామపక్ష పాలనలో అవినీతి చాలా సూక్ష్మంగా ఉంది.  కానీ టిఎంసి పాలనలో ఇది చాలా క్రూరంగా జరిగింది . వామపక్షాల మాదిరిగా కాకుండా, టిఎంసి ఎటువంటి సైద్ధాంతిక సమస్యను పట్టించుకోదు.

రాజకీయ హింసను  సామాన్యులను లక్ష్యంగా చేసుకోవడానికి వామపక్షాలు ఎప్పుడూ ఉపయోగించలేదు.  కానీ అది టిఎంసి పాలనలో జరగడం ప్రారంభించింది. టిఎంసి పాలనలో, సాధారణ ప్రజలను కూడా వేధించటం ప్రారంభించారు. సాధారణ ప్రజలపై మాదకద్రవ్యాల ఆరోపణ లేదా అత్యాచారం కేసులు ఉన్నాయి.

లాక్ డౌన్ సమయంలో కూడా, టిఎంసి అవినీతి చేసింది. పేద ప్రజల జీవనోపాధికి ఏకైక వనరు అయిన ఎంజిఎన్ఆర్ఇజిఎ నుండి డబ్బు తీసుకుంది. అమ్ఫాన్ తుఫాను సమయంలో, టిఎంసి నాయకులు అవినీతికి పాల్పడ్డారు. ప్రజలు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు.  వారికి బిజెపియే  ప్రత్యామ్నాయం.

కానీ హిందూ ఓటర్లను ఏకీకృతం చేయడానికి బిజెపి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా జై శ్రీరామ్ నినాదాలు చేస్తున్నట్లు మనం టెలివిజన్ లో చూస్తున్నాము. 

జై శ్రీ రామ్ మమతా వ్యతిరేక నినాదం. ఇది హిందుత్వ నినాదంగా ప్రారంభం కాలేదు. ఇది టిఎంసిని ఎగతాళి చేయడం కోసం ప్రారంభించింది. నెమ్మదిగా అది అంతర్గతమైంది. మమత రెచ్చగొడుతున్నందున బిజెపి జై శ్రీ రామ్ నినాదాలతో ఎదుర్కోవడం ప్రారంభించింది.

ఇది క్యాచ్‌ఫ్రేజ్ గా మారింది .బైగాల్‌లో టిఎంసి పాలనకు వ్యతిరేకంగా తమను తాము విభేదిస్తున్న ప్రతి ఒక్కరికీ జై శ్రీ రామ్ ఈ రోజు గుర్తించే గ్రీటింగ్‌గా మారింది. హిందుత్వ బెంగాల్‌లో ఆలస్యంగా ప్రవేశించింది. ఆధారం టిఎంసి పట్ల నెలకొన్న వ్యతిరేక. దాని పైన బిజెపి అనుకూల, హిందుత్వ సెంటిమెంట్ ఉంది. ప్రారంభ స్థానం హిందుత్వ కాదు.

మమతా బెనర్జీ పాలన ముగియడం అంటే చివరి లౌకిక బురుజు ముగింపు అని బిజెపి వ్యతిరేకులు అంటున్నారు.
బిజెపి అందరిని కలుపుకుపోయే పార్టీ కాకపోవడంతో ఇది లౌకిక రాజకీయాలను శాశ్వతంగా అంతం చేయడానికి దారి తీస్తుంది,  హిందూ ఓటు భారతదేశంలో ముఖ్యమవుతుందని అంటున్నారు. 

విషయాలను చూడటానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి కార్యకర్త యొక్క దృక్కోణం నుండి చూడటం. మరొకటి విశ్లేషకుల దృక్కోణం. నేను కార్యకర్త దృక్కోణానికి ప్రాధాన్యత ఇస్తాను.  మమత ఏ లౌకిక ఓటును సూచిస్తుంది?

లౌకికవాదానికి ఆధారం ఏమిటంటే మీరు గుర్తింపు రాజకీయాలకు ప్రాధాన్యత ఇవ్వకూడదు. బెంగాల్‌లో, 2011 నుండి  2021 మధ్య (మమతా పాలన), ఆమె గుర్తింపు రాజకీయాలకు తెరతీశారు. వామపక్ష పాలనలో ప్రధానంగా ఉండే తరగతిపై కులం,  మతం భాష ఉద్భవించింది.

వామపక్షాలు ఈ విషయాలనుఅనుసరింపలేదని నేను అనడం లేదు, కానీ వారు దానిని సూక్ష్మంగా అనుసరించారు. గుర్తింపు రాజకీయాలను బహిరంగంగా మమతా ప్రారంభించారు. ఆమె రాజకీయ అవసరాల కోసం మాథువా దళితులను ఒక శరణార్థిగా, పేదవారుగా చూడడం మానివేశారు.

గుర్తింపు రాజకీయాలను ఆడటానికి మమతా బహిరంగంగా ప్రయత్నం చేస్తుండడంతో ఇదివరలో సిపిఎం కాలంలో `తరగతి’ శ్రేణుల్లో ఉపయోగిస్తున్న అన్ని గుర్తింపులు, వారి కులం, మతం ఆధారంగా గుర్తింపు పొందడం ప్రారంభమైనది.

మమతా పాలనలో ముస్లిం మౌల్విలకు డబ్బు రావడం ప్రారంభమైంది.  అప్పుడు పూజారీలు కూడా డబ్బు పొందడం ప్రారంభించారు. దుర్గా పండల్స్ ప్రభుత్వం నుండి రూ .50 వేలు పొందడం ప్రారంభించారు. ఇంకా లౌకికవాదం ఎక్కడ ఉందో తెలుసుకోవాలనుకుంటున్నాను?

మమతా బెనర్జీ ప్రభుత్వంలో తాము ద్వితీయ శ్రేణి పౌరులంగా భావింప బడుతున్నట్లు బెంగాల్ హిందువులు భావిస్తున్నారా? ముఖ్యంగా ముహర్రం ఊరేగింపును అనుమతించిన కారణంగా దుర్గా పూజ నిమజ్జనం సమయంలో వెనుకడుగు వేయమని ఆమె చెప్పడం. 

అవును.

వారు చెప్పినట్లుగా, ‘హిందూ ఖత్రే మెయి హై’ కాబట్టి మోదీ  గెలుస్తాడు. బెంగాల్ ఎన్నికలలో అది ఒక కారకంగా ఉందా?

అక్కడ సూక్ష్మ హిందుత్వం ఉంది. హిందుత్వం ఒక సాధనంగా మారింది.  ప్రజలు ఈ విషయాల గురించి మాట్లాడుతున్నారు.  కాని వాస్తవం ఏమిటంటే ప్రజలు హిందుత్వ తీవ్ర భావాలకు ప్రభావితం కావడం లేదు.

హిందువులను అణచి వేస్తున్నట్లు  ప్రజలు చెప్పినప్పుడు, దీని అర్థం మేయర్ పదవి లేదా మునిసిపల్ స్థాయిలో పదవులకు హిందువులకు ద్వితీయ ప్రాధాన్యత ఇస్తూ, ముస్లింలకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఒక అవగాహనకు వచ్చారు.

ఇటువంటి అవగాహన ఉంది.  హిందుత్వం ఉంది. కానీ దాని అర్ధం  వారు ముస్లింలను తరిమికొట్టాలని లేదా ముస్లిం రక్తాన్ని కోరుకుంటున్నట్లు కాదు. హిందువులు టిఎంసికి ఓటు వేసినప్పుడు వారు లౌకికవాదులు అవుతారు. వారు బిజెపికి ఓట్ వేస్తే మారిన్నట్లా? కాదనే దానికి సమాధానం.

లోతుగా వెళ్లి పరిశీలన చేస్తే వారి టిఎంసి వ్యతిరేక సెంటిమెంట్ కారణంగా  బిజెపికి అవకాశం ఏర్పడినది స్పష్టం అవుతుంది.

రెండవది, బిజెపి అధికారంలోకి వస్తే – వారు ఖచ్చితంగా అధికారంలోకి వస్తారని నేను నమ్ముతున్నాను – వారు హిందుత్వ రాజకీయాలను ప్రతిచోటా చేసే విధంగా క్రమపద్ధతిలో వర్తింపజేస్తారు. అది వారి సమీకరణ వ్యూహం.

లౌకికవాదం, హిందుత్వ ఒకదానితో మరొకటి తలపడినప్పుడు, లౌకికవాదం వెనుకడుగు వేస్తుంది. కానీ మమతా ఇప్పటికే ఆచరణలో  లౌకికవాదాన్ని సమాధి చేసినదని నేను చెబుతున్నాను. ఆమె రాజకీయమయం చేసి, గుర్తింపు రాజకీయాలను ప్రారంభించింది.

లౌకికవాదం అంటే హిందుత్వంతో పోరాడటమే కాదు. కులం, మతం, వర్గ రాజకీయాలతో కూడా పోరాడటం. నీవు ముందు మౌల్విలకు జీతాలు ఇవ్వడం ప్రారంభించి, ఆ తర్వాత సరే మందిరాల పండితులకు కూడా ఇద్దామని చెప్పడం కాదు.

మమతా బెనర్జీని ఎదుర్కోవడానికి బిజెపికి సిఎం అభ్యర్థి లేకపోవడం ప్రభావం చూపుతుందా?

పశ్చిమ బెంగాల్ ఎన్నికలు మమతా వర్సెస్ మోడీ పోరాటం. మీరు మీ నియోజకవర్గంలో బిజెపికి ఓటు వేయబోతున్నందున అభ్యర్థి ఎవరు అని పశ్చిమ బెంగాల్ ప్రజలను అడిగితే, వారు  తాము బిజెపి చిహ్నానికి ఓటు వేస్తున్నందున అభ్యర్థి ఎవ్వరో తమకు పట్టింపు లేదని చెప్పారు.

(రెడిఫ్.కామ్ నుండి)