కేంద్ర ప్రభుత్వం వల్లే పసుపు ధర పెరిగింది

కేంద్ర ప్రభుత్వం పసుపు దిగుమతులను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం వల్లే పసుపు ధర పెరిగిందని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ స్పష్టం చేశారు. శుక్రవారం నిజామాబాద్‌లోని వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌ను ఆయన సందర్శించారు. కొత్త వ్యవసాయ చట్టాల వల్ల రాబోయే రోజుల్లో పసుపు ధర మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

 నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌లో రైతులకు మౌలిక వసతులను కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అరవింద్ ఆరోపించారు. నిజామాబాద్‌లో పసుపు ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. 

కాగా, కేసీఆర్‌, కేటీఆర్‌లు పరిపాలనలో విఫలమయ్యారని మాజీ ఎంపీ వివేక్‌ విమర్శించారు. ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌ సూచీలో గతంలో 4వ స్థానంలో నిలిచిన హైదరాబాద్‌ ప్రస్తుతం 24వ స్థానానికి దిగజారిందని పేర్కొన్నారు. ముద్ర లోన్లు రావడంలేదని మంత్రి కేటీఆర్‌ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ధ్వజమెత్తారు.