ముంబై డ్రగ్స్‌కేసులో రియా సహా 33 మందిపై చార్జ్‌షీట్

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణ సంబంధిత డ్రగ్స్ కేసులో ఎన్‌సిబి శుక్రవారం చార్జ్‌ర్జీషీట్ దాఖలు చేసింది. ముంబైలో ని ప్రత్యేక న్యాయస్థానానికి సమర్పించిన అభి యోగపత్రంలో నటి రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ సహా మొత్తం 33 మంది పేర్లు చేర్చారు. 

సుశాంత్ అనుమానాస్పద మృతి తరువాతి క్రమంలో ముంబై చిత్ర పరిశ్రమకు నిషా పదార్థాలు సరఫరా చేసే డ్రగ్స్ మాఫియాకు లింక్‌లు ఉన్నా యనే విషయం సంచలనం కల్గించింది. దీనికి సంబంధించి మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్‌సిబి) తీవ్రస్థాయి దర్యాప్తు జరిపింది. ఇప్పు డు 12000 పేజీలతో కూడిన చార్జ్‌షీట్‌లో కేసుకు సంబంధించి 200మంది నుంచి సేకరించిన వాంగ్మూలాలను పొందుపర్చారు. 

గత ఏడాది జూన్ లో ప్రవర్థమాన నటుడు సుశాంత్ ముంబైలోని తన ఫ్లాట్‌లో చనిపోయి ఉండటంతో కేసు పలు మలుపులు తిరిగింది. ఘటనకు సంబంధించి సహ నటి రియా చక్రవర్తిని, ఆమె సోదరుడిని మాదక ద్రవ్యాల నియంత్రణ చట్టం పరిధిలోని పలు ని బంధనల కింద అరెస్టు చేశారు. తరువాత బెయిల్‌పై విడుదలయ్యారు. కేసుకు సంబంధించి ఎన మండుగురు ఇప్పటికీ జుడిషియల్ కస్టడీలో ఉన్నారు.

ముంబైలో జరిగే పలు డ్రగ్స్ పార్టీలలో సిని మా ప్రముఖులు పాల్గొనడం, డ్రగ్స్ ముఠాలతో సి నిమా వాళ్లకు పరిచయాల గురించి వెలువడ్డ అం శాలతో ఎన్‌సిబి దర్యాప్తు కీలకంగా మారింది. చర స్, గంజాయి, ఎల్‌ఎస్‌డి, సైకోట్రాపిక్ పదార్థాలు బాలీవుడ్ ప్రముఖుల పార్టీల్లో దొరికినట్లు, అదే విధంగా అక్రమాలు జరిగినట్లు తెలిపే సాక్షాలు, డిజిటల్ ప్రక్రియలో లభించాయి.

ఫోన్ కాల్స్, వా ట్సాప్ చాట్స్, వీడియో, వాయిస్ రికార్డులను ఇత రత్రా పత్రాలను తాము ఇప్పటి చార్జ్‌షీట్‌తో పాటు జతచేసి దాఖలు చేసినట్లు మాదక ద్రవ్య నియం త్రణ సంస్థ తెలిపింది.