ఫేస్‌బుక్‌కు అమెరికా కోర్టు రూ 4,500 కోట్ల ఫైన్ 

ప్రముఖ సోషల్‌ మీడియా సంస్థ ఫేస్‌బుక్‌కు అమెరికా కోర్టు షాకిచ్చింది. 2015లో వేసిన ఒక పిటిషన్‌ను విచారించిన కోర్టు.. ఫేస్‌బుక్‌ 650 మిలియన్‌ డాలర్ల అంటే దాదాపు రూ 4,500 కోట్ల  నష్టపరిహారం చెల్లించాలంటూ ఆదేశించింది. వ్యక్తిగత గోప్యతకు ఫేస్‌బుక్‌ భంగం కలిగించిందంటూ దాఖలైన ఈ పిటిషన్‌కు 16 లక్షల మంది మద్దతుగా నిలిచారు. 

ఫొటోల్లో అనుమతి లేకుండా యూజర్లను ఫేస్‌బుక్‌ ఫేస్‌ట్యాగ్‌ చేస్తోందని, ఇది ప్రైవసీ పాలసీని ఉల్లంఘించడమేనని ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై పలువురు యూజర్లు ఫేస్‌బుక్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వీరందరికీ కలిపి 650 మిలియన్‌ డాలర్ల (దాదాపు 4,500 కోట్ల రూపాయలు)నష్టపరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. దీంతో ఒక్కో యూజర్‌కి 345 డాలర్లు చెల్లించాల్సి వుంది. ప్రైవసీ పాలసీకి సంబంధించిన కేసుల్లో ఇంత మొత్తంలో నష్ట పరిహారం విధించడం ఇదే మొదటిసారని జడ్జి వ్యాఖ్యానించారు.