రామ మందిర్ కు రూ.2వేల కోట్ల విరాళాలు

అయోధ్య రామ మందిర్ నిర్మాణం కోసం ఇప్పటి వరకు రూ.2 వేల కోట్ల వరకు విరాళాలు వచ్చినట్టు అయోధ్య ట్ర‌స్ట్ కార్యాల‌యం ఇన్‌చార్జ్ ప్ర‌కాష్ గుప్తా తెలిపారు. 44 రోజుల పాటు సాగిన విరాళాల సేకరణ శనివారంతో ముగిసిందని ఆయన చెప్పారు.  
 
ఇంకా చాలా వ‌ర‌కు డబ్బును బ్యాంకుల్లో డిపాజిట్ చేయాల్సి ఉన్న‌ట్లు ఆయన పేర్కొన్నారు. ఈ విరాళాలు ఇంకా పెరిగే అవకాశం ఉందని, విరాళంగా వ‌చ్చిన మొత్తాన్ని శ్రీ రామ‌జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర ట్ర‌స్ట్ ఖాతాల్లో జ‌మ చేస్తామని ఆయన వెల్లడించారు.
 
వచ్చిన విరాళాలను లెక్కించి , ఆడిట్ ప్రక్రియ పూర్తయ్యేందుకు నెల రోజులు పడుతుందని ఆయన చెప్పారు. లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఓ యాప్ ను రూపొందించామని, విరాళాలను లెక్కించే వారికి ఐడి, పాస్ వర్డ్ ఇచ్చామని, వారు ప్రతి రోజు డేటాను అందులో నమోదు చేస్తారని ఆయన వెల్లడించారు.  
 
44 రోజుల పాటు సాగిన ఈ విరాళాల సేకరణలో భాగంగా దేశ‌వ్యాప్తంగా 5 ల‌క్ష‌ల గ్రామాల్లోని 11 కోట్ల కుటుంబాల్లో ఉన్న మొత్తం 55 కోట్ల మంది నుంచి విరాళాలు సేకరించినట్టు ఆయన వివరించారు. ఈ ప్ర‌క్రియను ప‌ర్య‌వేక్షించ‌డానికి ప్ర‌త్యేకంగా ఓ యాప్‌ను రూపొందించారు. ఈ ప్ర‌క్రియ‌లో పాల్గొనే ప్ర‌తి ఒక్క‌రికీ ఐడీ, పాస్‌వ‌ర్డ్ ఇచ్చామ‌ని, వారు ప్ర‌తి రోజూ డేటాను అందులో న‌మోదు చేస్తార‌ని గుప్తా చెప్పారు.