శీతాకాలం ముగిసేనాటికి పెట్రోల్ ధరలు తగ్గుముఖం

ఇంధన ధరలు పెరుగుతుండడంపై ప్రజలు వెలిబుచ్చుతున్న ఆందోళనలను కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి దేవేంద్ర ప్రధాన్‌ కొట్టిపారేశారు. శీతాకాలం ముగిసేనాటికల్లా ధరలు తగ్గుముఖం పడతాయని ప్రకటించారు.

అంతర్జాతీయ మార్కెట్‌లో పెరిగిన పెట్రోలియం ధర వినియోగదారులను ప్రభావితం చేస్తుంది. శీతాకాలం వెళ్లిపోగానే ధరలు కూడా తగ్గుతాయి. ఇది అంతర్జాతీయ పరిణామాలకు సంబంధించిన అంశం. డిమాండ్‌ పెరిగితే ధర పెరుగుతుంది. శీతాకాలంలోనే ఇది జరుగుతుందని పేర్కొన్నారు.

చమురు ఉత్పత్తి చేసే దేశాల్లో ముడి చమురు ధరలు పెరగడం వల్ల దేశంలో చమురు ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ముడి చమురును సరఫరా చేసే దేశాలు తమ స్వలాభం కోసం ధరలను పెంచుతున్నాయని విమర్శించారు. ఫలితంగా వీటి ప్రభావం చమురు ఆధారిత దేశంలోని వినియోగదారులపై పడుతోందని చెప్పారు. ఇదే అంశంపై ఆయా దేశాలతో చర్చించినట్లు కూడా ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.

‘అంతర్జాతీయంగా పెట్రోలియం ధరలు పెరగడం వినియోగదారులపై తీవ్ర ప్రభావం పడుతోంది. శీతాకాలం పోతే పెట్రోల్‌ ధరలు దిగి వస్తాయి. అయినా, ఇది అంతర్జాతీయ మార్కెట్ లో డిమాండ్‌ ఎక్కువగా ఉన్నప్పుడు ధరలు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా శీతాకాలంలో డిమాండ్‌ అధికంగా ఉంటుంది. ఈ సీజన్‌ గడిస్తే ధరలు తగ్గుతాయి’’ అని మంత్రి పేర్కొన్నారు.

దేశంలో ఎల్‌పిజి, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పదే పదే పెరుగుతూ వస్తున్నాయి. చమురు, గ్యాస్‌ రంగానికి ఈశాన్య రాష్ట్రాలు ఎందుకు కీలకమో ఆయన ఒక ఇంటర్వ్యూలో వివరించారు. అస్సాంలోని దిగ్బోరు, దులియాజన్‌ ప్రాంతాలకు సమీపంలో మొదటిసారిగా చమురు నిక్షేపాలను కనుగొన్నారని, దేశ చమురు వనరుల్లో 18శాతం ఇక్కడ నుండే వస్తాయని తెలిపారు.