ఎంఎస్ఎంఈలకు రూ 26వేల కోట్ల బకాయిల చెల్లింపు 

మధ్యతరహా, చిన్న, సూక్ష్మ పరిశ్రమల(ఎంఎస్‌ఎంఈ)కు 26,821.08 కోట్ల రూపాయల బాకీని చెల్లించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. 2020 మే నుంచి డిసెంబర్ వరకు ఉన్న ఈ బాకీలను ఇప్పటికే చెల్లించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. 
 
వాస్తవానికి ఇప్పటి వరకు 34,506.09 కోట్ల రూపాయాల ఎంఎస్ఎంసీ బకాయిలు ఉన్నాయి. కేంద్రం డిసెంబర్ వరకు చెల్లించిన మొత్తం పోగా రూ.7,685.01 కోట్ల బకాయి ఉన్నాయి. అయితే 26 మంత్రిత్వ శాఖలు 105 సీపీఎస్‌ఈల ద్వారా రూ.6,499.92 కోట్లు సేకరించాయట.
 
 ఇందులో నుంచి రూ. 4,821.90 కోట్లు ఎంఎస్‌ఎంఈలకు క్లియర్ చేయగా, రూ.1,678.02 కోట్లు బకాయి ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. కమ్యూనికేషన్స్, హెవీ ఇండస్ట్రీస్ అండ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్, పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్, స్టీల్, పవర్, కోల్ మొదలగు మంత్రిత్వ శాఖలకు సంబంధించి చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమలకు అతి తక్కువ అప్లికేషన్లు వచ్చినట్లు పేర్కొన్నారు.