వ్యవసాయ చట్టాలపై మాట మార్చిన కెనడా ప్రధాని!

కొద్ది రోజుల క్రితం వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న ఆందోళనకు మద్దతుగా నిలబడాలని వ్యాఖ్యానించిన కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో యూటర్న్ తీసుకున్నట్లే కనిపిస్తోంది. రైతుల ఆందోళన విషయంలో మోదీ ప్రభుత్వం చాలా బాగా వ్యవహరించిందని ప్రశంసలు కురిపించినట్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ శుక్రవారం పేర్కొంది. 

తాజాగా నరేంద్రమోదీ కెనడా ప్రతినిధులతో ఫోన్‌లో మాట్లాడారు. కోవిడ్-19 వ్యాక్సీన్ పంపిణీ గురించి చర్చించారు. మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ మీడియాతో మాట్లాడుతూ కెనడాలోని దౌత్యపర కార్యకలాపాలకు సిబ్బంది తగినంత భద్రత, సహకారం కల్పిస్తామని చెప్పటినట్లు తెలిపారు.

‘‘ప్రజాస్వామ్యానికి తగినట్లుగా చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవడానికి భారత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ప్రశంసించారు. కెనడాలోని భారతీయ సిబ్బందికి, ప్రాంగణాలకు రక్షణ కల్పించడంలో తన ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరిస్తుందని హామీ కూడా ఇచ్చారు’’ అని శ్రీవాస్తవ పేర్కొన్నారు.