పెట్రోలుపై రూ. 5 తగ్గించిన బీజేపీ ప్రభుత్వం 

పెట్రోల్, డీజిల్ ధరలను ఆకాశాన్నంటుతున్న తరుణంలో అసోం సంచలన నిర్ణయం తీసుకుంది. పెట్రోలుపై లీటరుకు 5 రూపాయలు తగ్గిస్తూ అ‍క్కడి బీజీపే సర్కారు వాహన దారులకు భారీ ఊరట నిచ్చింది. అలాగే మద్యంపై సుంకాన్ని 25 శాతం తగ్గించినట్లు అసోం ప్రభుత్వం  వెల్లడించింది.
 
సవరించిన ఈ రేట్లు  శుక్రవారం అర్ధరాత్రి నుండి అమలులోకి  ఆర్థిక మంత్రి హిమంత బిస్వాస్ అసెంబ్లీలో ప్రకటించారు. కోవిడ్-19 విస్తరణ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్‌, మద్యంపై అదనపు సెస్ విధించాం..కానీ ఇప్పుడు, రోగుల సంఖ్య  బాగా తగ్గింది. 
 
ఈ నేపథ్యంలో తాజా రేటు కోతను ప్రకటించామని తెలిపారు. దీంతో పెట్రోలుపై లీటరుకు 5 రూపాయల భారం తగ్గుతుందని, తద్వారా లక్షలాది వినియోగదారులకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు.
 
 కాగా అసోంలో అసెంబ్లీ ఎన్నికలు మార్చి-ఏప్రిల్‌లో జరగనున్నాయి, ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారాన్ని నిలబెట్టుకోవాలని భారీ కసరత్తు చేస్తోంది.