కేసీఆర్ అండతో షర్మిల కొత్త పార్టీ!

తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తానని పేర్కొంటూ దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి  వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిల నేడు కొత్త పార్టీ ఏర్పాటు ప్రక్రియను  ప్రారంభించారు. తెలంగాణలో రాజన్న రాజ్యం లేదని.. ఎందుకుండకూడదని ఆమె ప్రశ్నించారు. 

కాగా, కేపీవీ, కేసీఆర్‌ల అండతోనే షర్మిల తెలంగాణలో పార్టీ పెడుతోందని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. కేసీఆర్ తన పదవిని పదిలం చేసుకునే ఎత్తుగడలో ఇదీ ఒక భాగమని ఆయన పేర్కొన్నారు. మధ్యంతర ఎన్నికలకు కేసీఆర్ సిద్ధమా అని ఆయన సవాల్ విసిరారు.

షర్మిల ఈరోజు లోటస్‌పాండ్‌లో వైఎస్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సమ్మేళనానికి వైఎస్ఆర్ అభిమానులు, జగన్ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ అభిమానులకు చెప్పకుండా పార్టీ పెట్టను. అన్ని జిల్లాల నాయకులతో మాట్లాడుతా. పార్టీ పెట్టాలా? వద్దా? అనే విషయంపై కూడా చర్చిస్తా. త్వరలోనే అన్ని విషయాలు ప్రకటిస్తా. క్షేత్రస్థాయి పరిస్థితులను అర్థం చేసుకోవడానికే ఈ సమావేశం నిర్వహిస్తున్నాను.’  అని చెప్పారు. 

`మొదట నల్గొండ జిల్లా నాయకులతో మాట్లాడుతున్నాను. ఆ తర్వాత అన్ని జిల్లాల నేతలను కలుస్తా. వైఎస్ఆర్ లేని లోటు తెలంగాణలో ఉంది’ అని ఆమె పేర్కొన్నారు. కాగా.. విశ్వసనీయ సమాచారం మేరకు షర్మిల జూన్‌లో కొత్త పార్టీ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

కాగా,  షర్మిల రానున్న 30 రోజులు పార్టీ నిర్మాణంపై పూర్తి దృష్టిసారిస్తారని.. ఆ తర్వాతే పార్టీపై కీలక ప్రకటన చేస్తారని తెలుస్తోంది.  త్వరలోనే 100 నియోజకవర్గాల్లో 16 నెలలపాటు పాదయాత్ర నిర్వహిస్తారని కూడా షర్మిల నిర్వహిస్తారని చేబూయున్నటు. 

మరోవైపు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీమ్ కూడా షర్మిల పార్టీని అన్ని విధాలుగా చూసుకుంటారని సమాచారం. నల్గొండ జిల్లా కార్యకర్తలతో షర్మిల సమావేశం ఇంకా కొనసాగుతోంది. అభిమానులు, కార్యకర్తలు, నేతల నుంచి షర్మిల సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు.

వైఎస్‌ఆర్‌, తెలంగాణ పేర్లు వచ్చే విధంగా పార్టీ పేరు నామకరణం చేస్తారని నేతలు చర్చించుకుంటున్నారు. కాగా వైఎస్‌ఆర్‌ తెలంగాణా పార్టీగా పేరు ఉండే అవకాశముందన్నారు. ఇప్పటికే ఈ పేరును ఎన్నికల సంఘం వద్ద రిజిష్టర్‌ కూడా చేశారు.