టిఎంసి మాజీ నేత సౌమేందు అధికారి శుక్రవారం బిజెపిలో చేరారు. తనతో పాటు 5వేల మంది టిఎంసి కార్యకర్తలు కూడా పార్టీ మారినట్లు తెలిపారు. 
ఇటీవలే టిఎంసి నుంచి బిజెపిలోకి మారిన సువేందు అధికారికి సౌమేందు సోదరడు. సువేందు కూడా టిఎంసిలో చాలా కాలం ప్రముఖ నేతగా ఉన్నారు. ఇప్పుడు పార్టీ మారిన సౌమేందు ఇటీవలే కొంటాయ్ మున్సిపాల్టీలో అడ్మినిస్ట్రేటర్ పోస్టు నుంచి తొలిగించారు. 
బెంగాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలతో గెలుస్తామని, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి తీరుతుందని పార్టీ మారిన సందర్భంగా సౌమేందు ప్రకటించారు. ప్రధాని మోదీ  ఆలోచనలు, ఆశయాలకు అనుగుణంగా ముందుకు వెళ్లుతామని సోదరుడు సువేందు తెలిపారు. 
సువేందు డిసెంబర్ 16న టిఎంసిని వీడారు. టిఎంసి స్టీరింగ్ కమిటీ, రాష్ట్ర కమిటీలలో సభ్యుడిగా ఉన్నారు. ప్రముఖ కార్మిక సంఘ నేతగా పేరొందారు. మమత బెనర్జీ ప్రభుత్వంలో కీలక శాఖల మంత్రిగా కూడా వ్యవహరించారు.  
                            
                        
	                    
More Stories
7న సామూహికంగా వందేమాతరం ఆలాపన
తండ్రి పేరు చెప్పడానికి ఎందుకు భయం తేజస్వి?
కుటుంబ వ్యాపారంలా భారత్ రాజకీయాలు