పాకిస్థాన్‌లోని వాయవ్య ప్రాంతంలో ఉన్న కరక్ పట్టణంలో ఓ హిందూ దేవాలయాన్ని తగులబెట్టిన సంఘటనపై మానవ హక్కుల కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనను పాకిస్థాన్ మానవ హక్కుల శాఖ మంత్రి షిరీన్ మజరి కూడా ఖండించారు. నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని ఆదేశించారు.
జిల్లా పోలీస్ అధికారి ఇర్ఫాన్ ఉల్లా మాట్లాడుతూ, ఈ దేవాలయం విధ్వంసానికి కారకులను అరెస్టు చేయాలని షిరీన్ మజరి కోరారని చెప్పారు. కొందరు నిందితులను తాము అరెస్టు చేశామన్నారు.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, రాడికల్ జమియత్ ఉలేమా-ఈ-ఇస్లామ్ పార్టీ నేతలు, స్థానికులు ఈ దేవాలయాన్ని తగులబెట్టినట్లు తెలుస్తోంది. స్థానిక హిందువులు ఈ దేవాలయాన్ని పునరుద్ధరించేందుకు అనుమతి తీసుకుని, పునరుద్దరణకు పనులు చేస్తున్న సమయంలో ఈ దారుణం జరిగినట్లు సమాచారం.

More Stories
బంగ్లాదేశ్లో సజీవ దహనం నుండి తప్పించుకున్న మరో హిందూ
ఉగ్రవాదలతో పాకిస్థాన్ సంబంధాలు బట్టబయలు
రష్యా న్యూఇయర్ వేడుకలపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి.. 24 మంది మృతి