
దేశ తొలి హోంమంత్రి సర్ధార్ వల్లాభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. దేశ సమగ్రత, సార్వభౌమత్వాన్ని పరిరక్షించేందుకు ఆయన చూపిన మార్గం ఎల్లప్పుడు మాకు స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు.
బలమైన, సుసంపన్నమైన దేశానికి పునాది వేసిన ఉక్కు మనిషికి నివాళులర్పిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. సర్దార్ వల్లాభాయ్ పటేల్ 1875 అక్టోబర్ 31 న గుజరాత్‌లోని నాడియాడ్‌లో జన్మించారు. 1947లో భారతదేశానికి స్వతంత్రం లభించిన తర్వాత దేశ ఉప ప్రధానిగా పటేల్ పని చేశారు.
అప్పట్లో భారతదేశంలో కలిసేందుకు విముఖంగా ఉన్న, విభేదిస్తున్న పలు సంస్థాలను జాతీయవాది అయిన పటేల్ ఒప్పించి, ఏకం చేసి భారతదేశంలో ఐక్యం చేసినందుకు.. ఆయనను భారత దేశ ఉక్కు మనిషి (ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా) అని కూడా పిలుస్తుంటారు.
భారత స్వాతంత్య్ర సంగ్రామ యోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు నివాళిగా గుజరాత్‌లోని కెవాడియాలో ఆయన స్మారకార్థం ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ పేరుతో ప్రపంచంలోనే ఎత్తయిన విగ్రహాన్ని నెలకొల్పారు. న్యూయార్క్‌లోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కంటే సర్దార్ పటేల్ విగ్రహం రెండు రెట్లు ఎత్తుగా ఉంటుంది. 2018లో అక్టోబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ దానిని ఆవిష్కరించారు.
More Stories
బంధుప్రీతి లేని ఏకైక ప్రదేశం ‘సైన్యం’
గగన్యాన్ ‘వ్యోమమిత్ర’లో ఏఐ ఆధారిత రోబో
ఆన్లైన్ ద్వారా ఓట్లను తొలగించటం అసాధ్యం