వరద సహాయంపై బండి సంజయ్ సంతకం ఫోర్జరీ 

వరద సహాయంపై బండి సంజయ్ సంతకం ఫోర్జరీ 

హైదరాబాద్ లో వరద బాధితులకు అందిస్తున్న ఆర్ధిక సహాయం కొనసాగించడానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కోడ్ అడ్డంకి కాదని స్పష్టం చేసిన రాష్ట్ర ఎన్నికల కమీషన్ అర్ధాంతరంగా సహాయం చేయడం నిలిపివేయాలని అంటూ బుధవారం మధ్యాన్నం ఆదేశాలు ఇవ్వడం, అందుకు బిజెపి కారణం అంటూ అధికారపక్షం విషప్రచారాన్ని ప్రారంభించింది. 

సహాయం నిలిపి వేయాలని కోరుతూ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ రాసినట్లుగా ఒక లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో చక్కర్లు కొడుతోంది. ఆ లేఖ ఆదారంగానే కేంద్ర ఎన్నికల సంఘం స్పందించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ తగు ఆదేశాలు జారీ చేసినట్లుగా  టీఆర్‌ఎస్‌  నేతలు వెంటనే ప్రచారం ప్రారంభించారు. 

అయితే ఈ లేఖ గురించి ఎన్నికల కమీషన్ మాత్రం మౌనం వహించడం గమనార్హం. వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికలతో కేంద్ర ఎన్నికల కమీషన్ కు సంబంధం లేదు. లేఖ అంటూ వ్రాస్తే నేరుగా రాష్ట్ర ఎన్నికల కమీషన్ కు వ్రాస్తారు గాని, కేంద్ర ఎన్నికల కమీషన్ కు వ్రాసే ప్రశ్న తలెత్తారు.    

వరద సహాయం పాంచరాదని కోరుతూ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ రాసినట్లుగా ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో చక్కర్లు కొడుతోంది. ఆ లేఖ ఆదారంగానే కేంద్ర ఎన్నికల సంఘం స్పందించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ తగు ఆదేశాలు జారీ చేసినట్లుగా రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. 

ఈసికి బిజెపి ఫిర్యాదు చేయడం వల్లే సాయం ఆగిపోయిందని  స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించడం గమనిస్తే ఇదంతా రాజకీయ కుట్రతో జరిగిన్నట్లు భావించవలసి ఉంటుంది.

వరద సాయం ఆపాలని తాను ఎన్నికల కమిషన్‌కు ఎటువంటి లేఖ రాయలేదని బండి సంజయ్‌ స్పష్టం చేశారు. తన సంతకం పోర్జరీ చేసి లేఖ విడుదల చేశారని ఆరోపించారు. బీజేపీ వల్లే వరద సాయం ఆగిందంటూ టీఆర్‌ఎస్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ నేతలే తన సంతకం పోర్జరీ చేసి లేఖ విడుదల చేశారని ఆరోపించారు.

 వరద సాయం బీజేపీ ఆపలేదని చెప్పడానికి చార్మినార్‌ భాగ్యలక్ష్మీ అమ్మవారి దగ్గర ప్రమాణం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని సంజయ్ వెల్లడించారు. సీఎం కేసీఆర్‌ ఒట్టు వేయడానికి సిద్ధమా అని సవాల్‌ విసిరారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి కేసీఆర్‌ పచ్చి అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు.

ఈ లేఖను కేవలం తన ప్రతిష్టను దిగజార్చడం కోసం సృస్టించారని ఆరోపిస్తూ సంజయ్ హైదరాబాద్  సైబర్ క్రైమ్  పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు జరిపి ఎవ్వరు దానిని సృష్టించారో తేల్చాలని కోరారు.