సోమశిల సిద్దేశ్వరం వంతెనకు కేంద్రం రూ 765 కోట్లు 

నాగర్‌కర్నూల్ జిల్లాలోని సోమశిల సిద్దేశ్వరం వంతెనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ జాతీయ రహదారి, వంతెన నిర్మాణానికి రూ  765 కోట్లు మంజూరు చేస్తూ అనుమతి ఇచ్చినట్లు జాతీయ బిసి కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి తెలిపారు. 
 
అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 2008లో సోమశిల సిద్దేశ్వరం బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇందుకోసం రూ 116 కోట్లు మంజూరు చేయగా అప్పట్లో ఎదురైన సాంకేతిక పరమైన అంశాలతో నిర్మాణ పనులు నిలిచిపోయాయి.
ఉమ్మడి రాష్ట్రంలో రాయలసీమ, తెలంగాణ ప్రాంత ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా ఈ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
కల్వకుర్తి నుంచి వయా నాగర్‌కర్నూల్, కొల్లాపూర్ మీదుగా సోమశిల వరకు జాతీయ రహదారి, సోమశిల వద్ద గల కృష్ణా నదిపై నుంచి రాయలసీమ ప్రాంతానికి చెందిన సిద్దేశ్వరం వరకు బ్రిడ్జిని నిర్మించనున్నారు. 
 
ఇందుకోసం రూ 765 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, ఇందుకోసం పరిపాలన అనుమతులు కూడా మంజూరు చేయనున్నట్లు ఆచారి తెలిపారు.