చైనాకు మరో షాక్ … ఏసీ ల దిగుమతిపై నిషేధం 

చైనాకు భారత్ మరో షాక్ ఇచ్చింది భారత్. చైనా నుంచి ఏసీల దిగుమతిని నిషేధించింది.  ఆత్మనిర్భర్ భారత్ క్యాంపెయిన్ లో భాగంగా… ఏసీలను దేశీయంగానే ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. 
 
గతంలో అగర్ బత్తీలు, టైర్లు, కలర్ టీవీలను ప్రభుత్వం   నిషేధించింది. దేశీయంగా ఏసీల మార్కెట్ విలువ 5 నుంచి 6 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. దీంతో మనదేశంలోనే వాటి ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు డిజిఎఫ్టి చైనా ఏసీలను నిషేధించింది.
 
ప్రధాని నరేంద్ర మోడీ దేశీయంగా తయారీ విధానాన్ని ప్రోత్సహించేందుకు ఆత్మనిర్భర్ భారత్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.  రిఫ్రిజిరేటర్లతో ఎయిర్ కండిషనర్ల దిగుమతి విధానాన్ని ధిస్తున్నట్లు ప్రకటించింది. దేశీయ తయారీని ప్రోత్సహించడం ద్వారా స్వావలంబన సాధించడానికి మన దేశం చేస్తోన్న ప్రయత్నాల్లో ఇది మరో అడుగు. 
 
ఇతర దేశాల నుంచి ఏసీల దిగుమతి విధానాన్ని భారత్ నిషేధించిందని విదేశీ వాణిజ్య డైరెక్టర్ జనరల్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రధాని మోదీ ఆత్మనిర్భర్ భారత్ పిలుపు నేపథ్యంలో అత్యవసరమైన వాటిని తప్ప మిగతావాటి దిగుమతిని కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తోంది. వివిధ రంగాలకు చెందిన కంపెనీలు కూడా అదే విధంగా ముందుకు సాగుతున్నాయి. 
 
దాదాపు 30 శాతం ఏసీలను ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నట్లు గతంలో ప్రధాని  తెలిపారు. వీలైనంత త్వరగా వీటిని తగ్గించుకునే ప్రయత్నాలు చేయాలని ప్రధాని గత జూన్ లో సూచించారు. దిగుమతి అవుతున్న వస్తువుల్లో ఏసీలను స్థానికంగా తయారు చేయగలిగిన వస్తువులుగా గుర్తించారు.