వాజ్‌పేయి స్వప్నాన్ని సాకారం చేశాం 

అటల్‌ టన్నెల్‌ నిర్మాణం పూర్తి చేసి వాజ్‌పేయి స్వప్నాన్ని సాకారం చేశామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. శనివారం రోహ్‌తాంగ్‌ పాస్‌ వద్ద అటల్‌ టన్నెల్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. సొరంగమార్గం అందుబాటులోకి రావడంతో కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతుంది.

మనాలీ-లేహ్‌ మధ్య ప్రమాణానికి 3 నుంచి 4 గంటల సమయం ఆదా అవుతుంది. ఢిల్లీ ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు సమయం తగ్గుతుందని ప్రధాని తెలిపారు. సరిహద్దులకు అదనపు బలం సైతం చేకూరుతుందని పేర్కొన్నారు.

ప్రపంచంలోనే ఎత్తైన ప్ర్రాంతంలోని ఫిర్ ఫంజల్ పర్వతశ్రేణిలో 9.02 కి.మీ. మేర అటర్ సొరంగ మార్గాన్ని మనాలి నుంచి లేహ్ వరకు నిర్మించారు. రూ. 3,500 కోట్ల వ్యయంతో పదేళ్లపాటు నిర్మించిన అటల్ సొరంగమార్గంతో లేహ్ నుంచి మనాలకి 475 కి.మీ. నుంచి 46కి.మీ. వరకు దూరం తగ్గనుంది.

అతిఎతైన ప్రాంతంలో ప్రపంచంలోనే అతిపొడవైన ఈ టన్నెల్‌ను ఎంతో వేగంగా నిర్మించాం. 26 ఏళ్లలో జరగాల్సిన పనిని కేవలం ఆరేండ్లలో పూర్తి చేశామని చెప్పారు. సరిహద్దులో అభివృద్ధి పనులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. లద్దాఖ్‌లోని దౌలత్‌బాగ్‌ ఓల్డీలో మౌలిక వసతులు కల్పించామని వివరించారు. 

విమానాలు, హెలికాప్టర్లు దిగేందుకు సౌకర్యాలు ఏర్పాటు చేశామని గుర్తుచేశారు.  రహదారుల అనుసంధానం దేశ ప్రగతిలో ముఖ్యపాత్ర పోషిస్తుందని చెబుతూ ఎన్నోకష్టాలకు, వ్యయప్రయాసల కోర్చి టన్నెల్‌ను నిర్మించామని వెల్లడించారు. నిర్మాణంలో పాలుపంచుకున్న ఇంజినీర్లను, సిబ్బందిని, అధికారులను ఆయన అభినందించారు.