కేవలం రైతుల ప్రయోజనాలకోసమే వ్యవసాయ చట్టాలు 

కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశంలో పలు ప్రాంతాలలో రైతులు నిరసన ప్రదర్శనలు జరుపుతున్నారు. ఈ చట్టాల కారణంగా తాము కార్పొరేట్ సంస్థలకు బానిసలుగా మారబోతున్నట్లు వారు భావిస్తున్నారు.  పైగా, ప్రభుత్వం కనీసం మద్దతు ధర (ఎంఎస్‌పి)ని రద్దు చేయడానికి కూడా సిద్దపడుతున్నదని, దానితో తమ పరిస్థితి మరింత దమనీయంగా మారుతుందనే ప్రచారానికి వారు గురవుతున్నారు.

ఈ అంశాలపై కేంద్ర ప్రభుత్వం ఏమి అనుకొంటుందో అని కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అవుట్ లుక్ ప్రతినిధి ప్రశాంత్ శ్రీవాస్తవకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సవివరంగా వివరించారు. ఇంటర్వ్యూలోని అంశాలు:

వ్యవసాయ రంగానికి సంబంధించి మూడు బిల్లులను ఎందుకు తీసుకు రావలసి వచ్చింది? అవి రైతుల పరిస్థితులపై ఎటువంటి ప్రభావం చూపుతాయి? 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికి ఏ విధంగా తోడ్పడతాయి? 

2014లో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పటిఅప్పటి నుండి వ్యవసాయరంగంలో సంస్కరణలు తీసుకు రావాలని, రైతుల ఆదాయం రెట్టింపు చేయాలని నిర్ణయించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆ దిశలో చర్యలు ప్రారంభించారు. వ్యవసాయ ఉత్పత్తి వాణిజ్య, వ్యాపార (ప్రోత్సాహం, సులభీకరణ), చట్టం, 2020 రైతులకు తమ ఉత్పత్తులను అమ్ముకొనే స్వేచ్ఛను కలిగిస్తుంది.

స్వతంత్రం వచ్చి 70 ఏళ్లయినా తమ ఉత్పత్తులను స్థానిక మార్కెట్ లో మాత్రమే అమ్ముకోవాల్సి వస్తున్నది రైతులు మాత్రమే. ఈ చట్టంతో వారికి మార్కెట్ నుండి స్వేచ్ఛ లభించింది. ఇప్పుడు రైతులు తమ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా, ఏ విధంగానైనా అముకోవచ్చు.

ఈ చర్యతో రైతులకు వారి ఉత్పత్తులకు మెరుగైన ధర లభించడమే కాకుండా, రవాణా ఖర్చులు తగ్గడం, మార్కెట్ రుసుములు లేకపోవడం కారణంగా వారి ఆదాయం కూడా పెరుగుతుంది. ఇంతకు ముందు వలే మండీలు (మార్కెట్ స్థలాలు), ఎపిఎంసి చట్టములు పనిచేస్తాయి. ఇప్పుడు మండీలు కూడా తమ మౌలిక సదుపాయాలను మెరుగుపరచుకొనేటట్లు ప్రోత్సాహం పొందుతాయి.

అదే విధంగా, ధర హామీ, వ్యవసాయ సేవలుపై రైతుల (సాధికారికత, రక్షణ) ఒప్పందం చట్టం, 2020 రైతులకు నేరుగా వ్యాపారాలు, కంపెనీలు, ప్రాసెసింగ్ పరిశ్రమలు, ఎగుమతిదారులతో అనుసంధానం ఏర్పర్చడానికి ఉద్దేశించినది.

వ్యవసాయ ఒప్పందం ద్వారా విత్తనాలు వేయడానికి ముందే ధర నిర్ణయిస్తూ ఉండడంతో ఎటువంటి పరిస్థితులలో అయినా రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది. ధరలు పెరిగితే కనీస ధరతో పాటు రైతులకు ఈ చట్టం ప్రకారం అదనపు ప్రయోజనం కలుగుతుందని ఈ సందర్భంగా నేను స్పష్టం చేయదలిచాను.

ఇక, నిత్యావసర వస్తువులు (సవరణ) చట్టం, 2020 క్రింద ధాన్యాలు, పాపు ధాన్యాలు, నూనె గింజలు. ఉల్లిపాయలు, బంగాళా దుంపలు వంటి వాటిని నిత్యావసర వస్తువుల పరిధి నుండి తీసి వేయడం జరిగింది.

దీని వలన నిల్వ ఉంచుకొనే, ప్రాసెసింగ్ చేసే సామర్ధ్యం పెరగడంతో రైతుల తమ పంటలను మార్కెట్ లో సమంజసమైన ధరకు అమ్ముకోవడానికి వీలు ఏర్పడుతుంది. ఈ మూడు చట్టాలు కూడా రైతుల ఆదాయాలు పెంచడం కోసం ప్రధాన మంత్రి నాయకత్వంలో తీసుకున్న విప్లవాత్మకమైన చర్యలు. భవిష్యత్ లో వాటి సానుకూల ఫలితాలు వస్తాయని నేను విశ్వసిస్తున్నాను.

నిత్యావసర వస్తువుల జాబితా నుండి ధాన్యాలను తీసి వేయడంతో దాచిఉంచే అవకాశం కలుగుతుందని రైతులు, నిపుణులు భయపడుతున్నారు. అదే జరిగితే, ప్రభుత్వం ఏ విధంగా జోక్యం చేసుకొంటుంది? 

నిత్యావసర వస్తువులు (సవరణ) చట్టం, 2020 ప్రకారం ఈ ఉత్పత్తులను మినహాయింపుల పరిస్థితులలో తప్ప మినహాయించడం జరిగింది. దాని వల్లన ధరలు 50 శాతంకు మించి పెరుగుతాయి.  ధరలు పెరిగినా, ఇతరత్రా పరిష్టితులు ఏర్పడినా ఇదివరలో వలే నియంత్రించే అధికారాలు ప్రభుత్వం కలిగి ఉంటుంది. అటువంటి పరిస్థితులలో బ్లాక్ మార్కెటింగ్, దాచివేయడాన్ని నిలిపి వేయడమే కాకుండా, ప్రభుత్వ జోక్యానికి కూడా చట్టంలో అవకాశం ఉంది.

కొత్త చట్టాలు రైతులకు కాకుకండా పెద్ద పెద్ద కంపెనీలు, ప్రైవేట్ రంగంపై మాత్రమే ప్రయోజనం కలిగిస్తాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మీరేమంటారు? 

కేవలం రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకు రావడానికి ఈ నూతన చట్టాలు ఉద్దేశించినవి. ఇవి పెద్ద పెద్ద కంపెనీలకు, ప్రైవేట్ రంగంపై ప్రయోజనం చేకూరుస్తాయనే అనుమానాలు అసంబద్దమైనవి. గ్రామాలకు, రైతులకు కూడా ప్రైవేట్ పెట్టుబడులు చేరాలనెడివే మా ఉద్దేశ్యం. అది మార్కెట్ లో పోటీని పెంచి, రైతులకు నేరుగా ప్రయోజనం కలిగిస్తుంది. రైతుల ప్రయోజనాలు కాపాడటం కోసమే ఈ చట్టాలు ఉద్దేశించినవి.

వ్యవసాయ ఉత్పత్తుల చట్టంలో వ్యవసాయ ఉత్పత్తుల గురించి కాకుండా వ్యవసాయ వస్తువులనే ప్రస్తావన ఉంది. భవిష్యత్ లో వ్యవసాయంపై పరిశ్రమ హోదా కల్పించి, పన్నులు విధించే అవకాశం ఉన్నదనే భయాన్ని ఇది కలిగిస్తున్నది. అటువంటి అనుమానాలు ఎంతవరకు నిజమైనవి? 

కొన్ని రాజకీయ పార్టీలు తమ సొంత ప్రయోజనాలకోసం అటువంటి అనుమానాలను లేవనెత్తుతున్నాయి. రైతులు ఇది వరలో వలే స్వతంత్రులే. వారి ఉత్పత్తులపై వారికి సమంజసమైన ధర లభించే విధంగా చేయడం కోసం అదనపు ఏర్పాట్లు చేయడం మాత్రమే జరిగింది. నూతన ప్రతిపాదనలు సరఫరా గొలుసును బలోపేతం చేస్తాయి. పంట చేతికి వచ్చిన తర్వాత ధాన్యాలు, పండ్లు, కూరగాయల నష్టాలు తగ్గుతాయి. చిన్న, సంఘటిత సరఫరా గొలుసు నుండి రైతులు, వినియోగదారులు ప్రయోజనం పొందుతారు.

అదే విధంగా వ్యవసాయ చట్టంలో వివాదాల పరిష్కార వ్యవస్థ క్లిష్టతరంగా ఉంది. వాటిని సివిల్ కోర్ట్ పరిధికి దూరంగా ఉంచడంపై ప్రతిపక్షాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఈ విషయమై ప్రభుత్వం ఏ విధమైన భరోసా ఇస్తుంది? 

ధర హామీ, వ్యవసాయ సేవలపై రైతుల (సాధికారికత, ఉత్పత్తి) చట్టం క్రింద స్థానిక స్థాయిలో వివాదాలను 30 రోజులలో పరిష్కరించాలని పేర్కొనడం జరిగింది. రైతులు కోర్ట్ ల చుట్టూ తిరగే అవసరం లేకుండా, నిర్ణీత సమయంలో వివాదాలు పరిష్కారం కావడమే దీని ఉద్దేశ్యం. ఈ వ్యవస్థ సంక్లిష్టం కాదని, వివాదాలు సులభంగా పరిష్కారం కాగలవని నేను స్పష్టం చేయదలచుకొన్నాను. రైతులు దానిని విశ్వసిస్తారు.

దీనిపై ప్రశ్నలు లేవనెత్తుతున్నవారికి వారి వారి రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ప్రతిపాదనలను కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల ప్రణాళికలో పేర్కొని వత్తిడులు, రాజకీయ సంసిద్ధత లేకపోవడంతో అమలు పరచలేక పోయింది. రైతులకు మూడు రోజులలో చెల్లింపులు జరపాలనే ప్రతిపాదనతో గతంలో ఎటువంటి చట్టం చేయలేదు.

ఎంఎస్‌పి పైన కూడా అనుమానాలున్నాయి. ఎంఎస్‌పి కన్నా తక్కువ మొత్తానికి కొనుగోలు చేయడాన్ని నిషేధిస్తూ చట్టం తీసుకు రావాలని ప్రయిటపక్షాలు, వివిధ రాష్ట్రాలలో నిరసనలు చేస్తున్న రైతులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందా?

ఎంఎస్‌పి వ్యవస్థ కొనసాగుతుందని, మున్ముందు కూడా ఉంటుందని నేను మరోసారి స్పష్టం చేయదలచుకొన్నాను. ఈ చట్టాలకు ఎంఎస్‌పితో ఎటువంటి సంబంధం లేదు. తమ ఉత్పత్తులను మండిలలో  ఎంఎస్‌పి కి అమ్మడానికి లేదా బహిరంగ మార్కెట్ లో అమ్ముకోవడానికి రైతులకు ఇప్పుడు స్వేచ్ఛ ఉంది. పండ్లు, కూరగాయల రైతులను తమ ఉత్పతులను మండీలలో మాత్రమే అమ్ముకోమని ఎందుకని వత్తిడి చేయాలి? 

ఎంఎస్‌పి ని నిర్ణయించే ఫార్ములాను మార్చే ప్రతిపాదన ఏదైనా ఉందా?    

రబి సీజన్లో విత్తనాలు నాటడానికి ముందే ఈ మధ్య మా ప్రభుత్వం ఆరు పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ ప్రకటన చేసింది. గోధుమల ఎంఎస్‌పి ని క్వింటాల్ కు రూ 1,975గా నిర్ణహించింది. అది ఉత్పత్తి వ్యయంకన్నా 106 శాతం ఎక్కవ. అదే విధంగా రైతులు ఉత్పత్తి వ్యయంకన్నా 50 నుండి 93 శాతం ఎక్కువగా ఎంఎస్‌పి ని వివిధ పంటలకు  పెంచాము. 

స్వామినాథన్ కమిటీ సిఫార్సులకు సంబంధించి వాటిని యుపిఎ ప్రభుత్వం అసలు అమలు పరచనే లేదు. మా ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో వాటిని అమలు పరుస్తున్నది. ఉత్పత్తి వ్యయంపై కనీసం 50 శాతం మొత్తాన్ని జతచేసి ఇప్పుడు  ఎంఎస్‌పి ని నిర్ణయ్హిస్తున్నాము.

మీ పురాతన భాగస్వామ్య పక్షం ఆకలి దళ్ ఎన్డీయే నుండి వైదొలిగింది. బిజూ జనతా దళ్, ఎఐఎడిఎంకె వంటి పక్షాలు సహితం ఈ అంశాలపై భిన్నమైన విధానాలు ఆవలంభిస్తున్నాయి.రాగాల రాజకీయ పరిణామాలు ఏమిటి?

రాగాల రాజకీయ పరిణామాలను పరిగణలోకి తీసుకోకుండా కేవలం రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే మాత్రమే ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిర్ణయాలు తీసుకున్నారు. రైతుల పేరుతో రాజకీయ ప్రయోజనాలకోసం ప్రయత్నం చేయవద్దని నేను అన్ని రాజకీయ పక్షాలను కోరుతున్నాను. చాలా సంవత్సరాలుగా వ్యవసాయ రంగంలో అమలు కాకుండా ఉంటున్న సంస్కరణలను మోదీజీ నాయకత్వంలో ఇప్పుడు అమలు పరుస్తున్నాము. దేశం, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రతివారు ఈ చట్టాలకు మద్దతు ఇవ్వాలి.

(అవుట్ లుక్ నుండి)