లద్దాఖ్‌కు 6వ షెడ్యూల్‌ ప్రకారం రక్షణ

లద్దాఖ్‌ ప్రాంత ప్రజలకు రాజ్యాంగంలోని 6వ షెడ్యూలు ప్రకారం పూర్తి స్థాయిలో రక్షణ కల్పించే అంశంపై కేంద్ర ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా భరోసా ఇచ్చారు. అమిత్‌షాతో లద్దాఖ్‌ ప్రాంతానికి చెందిన సీనియర్‌ నేతలు, మాజీ ఎంపీలు భేటీ అయ్యారు.

భాష, జనాభా, భూమి, ఉద్యోగాలు తదితర అంశాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని అమిత్‌షా లద్దాఖ్‌ ప్రతినిధులకు హామీ ఇచ్చారు. లేహ్‌ ఎన్నికలు ముగిసిన తర్వాత లద్దాఖ్‌ ప్రతినిధి బృందం, కేంద్ర హోంశాఖల మధ్య చర్చలు ప్రారంభమవుతాయి. 

అమిత్‌ షా హామీ ఇవ్వడంతో ఎల్‌ఏహెచ్డీసీ, లేహ్‌ ఎన్నికలను బహిష్కరించాలన్న పిలుపును ఉపసంహరించుకోవాలని లద్దాఖ్‌ ప్రతినిధుల బృందం నిర్ణయించింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, కిరెన్‌ రిజిజు పాల్గొన్నారు.