ఉమా భారతికి కరోనా పాజిటివ్

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత ఉమా భారతికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. తనతో ప్రైమరీ కాంటాక్ట్ లోకి వచ్చిన వారందరూ కరోనా టెస్టులు చేసుకోవాలని ఆమె సూచించారు. 
 
మూడు రోజుల నుంచి జ్వరం లక్షణాలున్నాయని, ఇటీవల హిమాలయాలకు వెళ్లిన సమయంలో కూడా కోవిడ్ -19 నిబంధనలను పాటించారని, అయినా కరోనా సోకిందని ఆమె సన్నిహితులు పేర్కొన్నారు.
 
 కాగా, దేశ వ్యాప్తంగా  కరోనా కేసుల సంఖ్య 60 లక్షలకు చేరువలో ఉన్నాయి. కరోనా మృతుల సంఖ్య 94 వేలు దాటింది. గడచిన 24 గంటల్లో 88,600 పాజిటివ్ కేసులు నమోదు అవగా… 1,124 మంది మృతి చెందారు. దేశ వ్యాప్తంగా మొత్తం 59,92,533 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే మొత్తం 94,503 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. 
 
ప్రస్తుతం దేశంలో 9,56,402 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అలాగే 49,41,627 మంది డిశ్చార్జ్ అయ్యారు. నిన్న ఒక్కరోజే 92,043 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 82.46 శాతం కాగా.. మరణాల రేటు 1.58 శాతంగా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.