నవంబర్దు 7న దుబ్బాక, 9న ఎమ్యెల్సీ ఎన్నికలు 

టి ఆర్ ఎస్ ఎమ్మెల్యే రామ‌లింగారెడ్డి మ‌ర‌ణంతో ఖాళీ అయిన దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక‌ల తేదీని కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించింది. ఈ స్థానానికి న‌వంబ‌ర్ 7వ తేదీన పోలీంగ్ జ‌ర‌గ‌నుంది. అక్టోబ‌ర్ 13న నోటిఫికేష‌న్ విడుద‌ల చేస్తారు
అధికారులు. 20వ తేది వ‌ర‌కూ నామినేష‌న్ లు స్వీక‌రిస్తారు. 21న నామినేష‌న్ స్క్రూటిని ఉంటుంది. నామినేష‌న్ ల ఉప‌సంహ‌ర‌ణ‌కు అక్టోబ‌ర్ 27 అఖ‌రు తేది. న‌వంబ‌ర్ 7న పోలింగ్ నిర్వ‌హించి, 10వ తేదీన ఫ‌లితాలు ప్ర‌క‌టిస్తారు. ఈ ఎన్నిక ఈవీఎంల‌తో జ‌ర‌గ‌నుంది. కరోనా ప్రొటోకాల్ ప్ర‌కారం పోలింగ్ ప్ర‌క్రియ నిర్వ‌హించ‌నున్నారు అధికారులు.
కాగా, కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఉపఎన్నిక  షెడ్యూల్  మళ్లీ విడుదలైంది.  అక్టోబర్‌ 9న  ఉదయం 9  నుంచి సాయంత్రం 5 గంటల వరకు  ఉపఎన్నిక పోలింగ్‌ నిర్వహించనున్నారు. అక్టోబర్‌ 12న  ఉప ఎన్నిక  ఓట్ల లెక్కింపు చేపడతారు.
 ముందుగా విడుదలైన నోటిఫికేషన్‌  ప్రకారం  ఏప్రిల్‌ 7న పోలింగ్‌ జరగాల్సి ఉండగా కరోనా వైరస్‌ కారణంగా ఎన్నిక ప్రక్రియ వాయిదా పడింది.   టీఆర్‌ఎస్‌ నుంచి మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత నామినేషన్‌ వేశారు.
నిజామాబాద్‌ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీగా ఎన్నికైన భూపతిరెడ్డి పార్టీ ఫిరాయింపునకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆయణ్ని అనర్హుడిగా ప్రకటిస్తూ ఆప్పటి మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలతో పాటు మున్సిపల్‌ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే  విజయం సాధించారు. దీంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీని టీఆర్‌ఎస్‌ సునాయాసంగా గెలుచుకునే అవకాశాలున్నాయి.