‘వైష్ణోదేవి’ దర్శనం కోసం త్వరలో యాప్‌  

పవిత్ర మందిరం నుంచి భక్తులకు నేరుగా ప్రత్యక్ష దర్శనం కల్పించేందుకు మొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభించాలని జమ్మూకశ్మీర్‌లోని మాతా వైష్ణోదేవి పుణ్యక్షేత్రం బోర్డు (ఎస్‌ఎమ్‌వీడీఎస్‌బీ) యోచిస్తోంది. ఈ యాప్‌ అక్టోబర్ 17న ప్రారంభమవుతుందని భావిస్తున్నారు.
శ్రీ మాతా వైష్ణోదేవి పుణ్యక్షేత్రం దేశవ్యాప్తంగా భక్తులకు ‘ప్రసాద్’ హోమ్ డెలివరీని ప్రారంభించింది. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా నేతృత్వంలోని ఎస్‌ఎమ్‌వీడీఎస్‌బీ సమావేశంలో ప్రసాద్ సేవను ప్రారంభించారు.
‘పూజ ప్రసాద్’ కోసం భక్తులు ఎస్‌ఎమ్‌వీడీఎస్‌బీ వెబ్‌సైట్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. బుకింగ్ చేసిన తర్వాత 72 గంటల్లో ‘పూజ’ నిర్వహించేలా చూస్తుందని, ‘ప్రసాద్’ స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించబడుతుందని అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.
పుణ్యక్షేత్ర బోర్డు వెబ్‌సైట్ maavaishnodevi.orgలో బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటుందని వివరించారు. ఏవైనా సందేహాలుంటే ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు 9906019475 కు కాల్ చేయవచ్చని చెప్పారు.
వైష్ణోదేవి మందిరం 2020 ఆగస్టు 16 న భక్తుల కోసం తిరిగి ప్రారంభించారు. కరోనావైరస్ మహమ్మారి కారణంగా దీన్ని మూసివేశారు.