అడ్మిషన్లు రద్దు చేసుకుంటే ఫీజులు వాపస్ 

ఈ ఏడాది విద్యా సంవ­త్స­రా­నికి సంబం­ధించి నవం­బర్‌ 30 వరకు యూని­వ­ర్సి­టీల్లో అండర్ గ్రాడ్యు­యేట్‌, పోస్ట్‌ గ్యాడ్యు­యేట్‌ కోర్సుల్లో తొలి ఏడాది అడ్మి­షన్లు రద్దు చేసు­కున్న, వలస వెళ్లిన విద్యా­ర్థు­లకు ఫీజులు తిరిగి చెల్లి­స్తా­రని కేంద్ర విద్యా­శాఖ మంత్రి రమేష్ పోఖ్రి­యాల్ నిశాంక్ తెలి­పారు.
కరోనా నేప­థ్యంలో విద్యా­ర్థుల తల్లి­దం­డ్రు­లపై మరింత భారం పడ­కూ­డ­దన్న ఉద్దే­శంతో ఈ ఒక్క­సా­రికి ప్రత్యే­కంగా ఈ మేరకు అవ­కాశం కల్పిం­చి­నట్లు చెప్పారు.
కరోనా నేప­థ్యంలో 2020-21 విద్యా సంవ­త్స­రా­నికి సంబం­ధించి మొదటి ఏడాది అండర్‌ గ్రాడ్యు­యేట్‌, పోస్ట్‌ గ్రాడ్యు­యేట్‌ విద్యా­ర్థుల సౌలభ్యం కోసం ఈ అక­డ­మిక్‌ క్యాలెం­డ­ర్‌కు సంబం­ధిం­చిన యూజీసీ మార్గ­ద­ర్శ­కాల మేరకు కమిటీ సమ­ర్పిం­చిన నివే­ది­కను కమి­షన్‌ అంగీ­క­రిం­చిం­దని రమేష్ పోఖ్రి­యాల్ నిశాంక్ చెప్పారు.
దీంతో అండర్ గ్రాడ్యు­యేట్‌, పోస్ట్‌ గ్యాడ్యు­యేట్‌ కోర్సుల్లో తొలి ఏడాది అడ్మి­షన్లు నవం­బర్‌ 30 వరకు రద్దు చేసు­కునే విద్యార్థులు, వలసవెళ్లిన విద్యార్థులు వారు చెల్లించిన ఫీజులు తిరిగి పొందుతారని చెప్పారు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేశారు.