బిజెపి ఏపీ కమిటీలో ఇద్దరు మాజీ మంత్రులు 

బిజెపి  రాష్ట్ర అధ్యక్షుడు  సోము వీర్రాజు తన కమిటీని నేడు ప్రకటించారు. వారిలో టిడిపి నుండి ఎన్నికల అనంతరం పార్టీలో చేరిన ఇద్దరు మాజీ మంత్రులు ఆదినారాయణ రెడ్డి, రావెల కిశోర్‌బాబులను ఉపాధ్యక్షులుగా నియమించారు. బిజెపి మాజీ శాసనసభ పక్ష నాయకుడు విష్ణుకుమార్ రాజును కూడా ఉపాధ్యక్షుడిగా నియమించారు. 

లంగి శ్రీదేవి (రాజమహేంద్రవరం), కాకు విజయలక్ష్మి (నెల్లూరు), మాలతీ రాణి (ఏలూరు), నిమ్మక జయరాజు (పార్వతీపురం), పైడి వేణుగోపాల్ (శ్రీకాకుళం), పీ సురేందర్ రెడ్డి (నెల్లూరు), చంద్రమౌలి (కర్నూలు)లకు కూడా  ఉపాధ్యక్ష పదవులను అప్పగించారు.

ఉత్తరాంధ్రకు చెందిన ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్‌ (విశాఖపట్నం), రాయలసీమకు చెందిన సోమగుంట విష్ణువర్ధన్ రెడ్డి (హిందూపురం) లతో లతో పాటు లోకుల గాంధీ (అరకు), సూర్యనారాయణ రాజు (కాకినాడ), ఎన్ మధుకర్ (విజయవాడ)లను ప్రధాన కార్యదర్శులుగా నియమించారు. మధుకర్ సంఘటన వ్యవహారాలు చూసే ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తారు. 

వి.  సత్యమూర్తిని కోశాధికారిగా నియమించడంతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యాలయ వ్యవహారాల బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర పార్టీ కార్యాలయ కార్యదర్శిగా పీ శ్రీనివాస్ నియమితులు అయ్యారు.

రాష్ట్ర కార్యదర్శులుగా ఉమామహేశ్వరి (శ్రీకాకుళం), కండ్రిక ఉమ (తిరుపతి), మట్టం శాంతికుమారి (అరకు), ఏ కమల (నెల్లూరు), కే చిరంజీవి రెడ్డి (అనంతపురం), పాతూరి నాగభూషణం (విజయవాడ), కే నీలకంఠ (కర్నూలు), బీ శ్రీనివాస్ వర్మ (నరసాపురం), ఎన్ రమేష్ నాయకుడు (రాజంపేట), ఎం సుధాకర్ రెడ్డి (గుంటూరు)లను నియమించారు. 

బీజేపీ రాష్ట్రశాఖ అనుబంధంగా పనిచేసే ఏడు మోర్చాలకు అధ్యక్షులను నియమించారు. సురేంద్ర మోహన్-యువ మోర్చా (విశాఖపట్నం), నిర్మలా కిశోర్-మహిళా మోర్చా (ఏలూరు), శశిభూషణ్ రెడ్డి-కిసాన్ మోర్చా (కడప), జీ దేవానంద్-ఎస్సీ మోర్చా (హిందూపురం), బిట్ర శివనారాయణ-ఓబీసీ మోర్చా (నరసరావుపేట), కే ఉమామహేశ్వర రావు-ఎస్టీ మోర్చా (అరకు), ఎస్‌కే బాజీ-మైనారిటీ మోర్చా (విజయవాడ) నియమితులు అయ్యారు.

పార్టీ అధికార ప్రతినిధులుగా పూడి తాతారావు (శ్రీకాకుళం), సుహాసిని ఆనంద్ (విశాఖపట్నం), చందు సాంబశివరావు (గుంటూరు), కే ఆంజనేయ రెడ్డి (నెల్లూరు), సామంచి శ్రీనివాస్ (తిరుపతి), భాను ప్రకాశ్ రెడ్డి (తిరుపతి)లను నియమించారు.