యశోద హోస్పెటల్ పై కఠిన చర్యలు తీసుకోవాలి 

ప్రజల ఆరోగ్యాల తో చెలగాటం ఆడుతున్న యశోద హోస్పెటల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ హైదరాబాద్ సుల్తాన్ బజార్ లో గల  డైరెక్టర్ మెడికల్ అండ్ హెల్త్ కార్యాలయం ముందు బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి గీతా మూర్తి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. 
 
యశోద హోస్పెటల్ యాజమాన్యం కోవిడ్ రోగుల పట్ల అధిక ఫీజు లు వసూలు చేస్తూ వారి మరణాల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తునందని ఆమె ధ్వజమెత్తారు.

గ్రూప్ 2 ఉద్యోగిని శ్రీమతి శ్వేతా రెడ్డి డెలివరీ నిమిత్తం హోస్పెటల్ లో చేరగా కరోన వచ్చిందని చెప్పి దాదాపు రూ 29 లక్షలు వసూలు చేసి భర్తకు కూడా చనిపోయిందో బ్రతికి ఉందొ చెప్పక వారి కుటుంబాన్ని మానసిక హింసకు గురిచేసాని గుర్తు చేశారు. 
 
అదేవిదంగా కొత్తగూడెం కు చెందిన ఒక వ్యక్తి యశోద హోస్పెటల్ లో కరోన చికిత్స కోసం చేరి చివరకు వారు పెట్టె ఇబ్బందులను తన కుటుంబానికి వీడియో కాల్ ద్వారా వివరించారని ఆమె పేర్కొన్నారు. 
 
స్థానిక అంబర్ పెట్ కు చెందిన వ్యక్తి ని కూడా హోస్పెటల్ లో చనిపోయాడని చెప్పి కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు వీడియో కాల్ లో చూపెట్టాలని కోరగా ఆ వ్యక్తి బతికే ఉన్నట్టుగా తెలిచిందని తెలిపారు. 
 
ఇలా ఎన్నోరకాలుగా తమ ఫీస్ లు రాబట్టుకోవాడినికి బతికిన వారిని చచ్చిన వారిగా  చచ్చిపోయిన వారిని బతికే ఉన్నట్లుగా చూపుతూ వసూలు చేసుకుంటున్నారని గీతా మూర్తి విమర్శించారు. 
 
గత నెలలో హైదరాబాద్ లో ఇలాగే అవకతవకలకు పాల్పడుతున్నారని ఒక హోస్పెటల్ లైసెన్స్ రద్దు చేసిన ఈ ప్రభుత్వానికి తమ బంధువు అయినందుకే యశోద హోస్పెటల్ మీద ఎన్ని ఫిర్యాదులు వచ్చినా చర్యలు తీసుకోవడం లేదని ఆమె ధ్వజమెత్తారు. 
 
అవసరమైతే  రూ 1000 కోట్లు ఖర్చుపెట్టి తెలంగాణ కు కరోన రానియ్యమని చెప్పిన కేసీఆర్ ఇదంతా ప్రతిపక్షాల అనవసర అలజడి అని ఎద్దేవా చేశారని ఆమె గుర్తు చేశారు. కానీ రాష్ట్రంలో కరోన ఉధృతి ఎక్కువకగానే చేతులు ఎత్తేసారని ధ్వజమెత్తారు. 
 
గచ్చుబౌలి లో ఏర్పాటు చేస్తామన్న కరోన హోస్పెటల్ ఎక్కడ పోయిందని ఆమె ప్రశ్నించారు. ఇప్పటివరకు కరోన చికిత్స నిమిత్తం వచ్చిన విరాళాలు ఎన్ని?  మీరు ఖర్చుపెట్టినది ఎంత? లెక్కలు చెప్పాలని గీత మూర్తి డిమాండ్ చేశారు. 
 
ప్రభుత్వం వెంటనే హోస్పెటల్ సంఖ్యను పెంచి  టెస్ట్ ల సంఖ్య ను కూడా పెంచాలని ఆమె డిమాండ్ చేశారు .అదేవిధంగా కరోన ను ఆరోగ్యశ్రీ లో చేర్చలని తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి న ఆయుశ్మన్ భారత్ లో చేరాలని కోరారు. 
 
తెలంగాణలో అత్యధికంగా పెరుగుతున్న కరోన వ్యాధికి అడ్డుకట్ట వేయాలని, యశోద హోస్పెటల్ పై వెంటనే చర్యలు తీసుకొని హస్పెటల్ లైసెన్స్ రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. లేని పక్షంలో మహిళ మోర్చా ఆందోళనను ఉధృతం చేయగలదని ఆమె హెచ్చరించారు.