హెచ్ఏఎల్ లైట్‌‌‌‌ హెలికాప్టర్‌‌‌‌ ట్రయల్ విజయవంతం   

హిందుస్థాన్‌‌‌‌ ఏరోనాటిక్స్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌ (హెచ్‌‌‌‌ఏఎల్‌‌‌‌) దేశీయంగా అభివృద్ధి చేసిన లైట్‌‌‌‌ యుటిలిటీ హెలికాప్టర్‌‌‌‌ (ఎల్‌‌‌‌యూహెచ్‌‌‌‌) హిమాలయాల్లో విజయవంతంగా ట్రయల్‌‌‌‌ పూర్తి చేసుకుంది. దౌలత్‌‌‌‌ బెగ్‌‌‌‌ ఒల్డీలో ఎత్తైన ప్రాంతంలో 10 రోజుల పాటు అక్కడి కష్టమైన వాతావరణ పరిస్థితులు, వేడిని తట్టుకుని నిలిచింది. 

లేహ్‌‌‌‌లో స‌‌‌‌ముద్ర మ‌‌‌‌ట్టానికి 3,300 మీట‌‌‌‌ర్ల ఎత్తులో ISA+320C ఉష్ణోగ్రతల మధ్య హాట్ అండ్ హై ఆల్టిట్యూడ్ ట్రయల్‌‌‌‌  సక్సెస్‌‌‌‌ఫుల్‌‌‌‌గా జరిగిందని హాల్‌‌‌‌ వెల్లడించింది.  సియాచిన్‌‌‌‌ గ్లేసియర్‌‌‌‌లో హెలికాప్టర్‌‌‌‌ పేలోడ్ సామ‌‌‌‌ర్థ్యాన్ని పరిశీలించినట్టు తెలిపింది. అత్యంత ఎత్తులో ఉన్న అమర్‌‌‌‌, సోనమ్‌‌‌‌ ప్రాంతాల్లోని హెలిప్యాడ్‌‌‌‌లపై హెలికాప్టర్‌‌‌‌ను విజయవంతంగా ల్యాండ్‌‌‌‌ చేశామంది. 

ఆర్మీ వెర్షన్‌‌‌‌ హెలికాప్టర్‌‌‌‌ ప్రస్తుతం క్లియరెన్స్‌‌‌‌ కోసం రెడీగా ఉందని చెప్పింది. ఇండియన్‌‌‌‌ ఆర్మీకి 126, నేవీకి 61 ఎల్‌‌‌‌సీహెచ్‌‌‌‌లు అవసరముందని వివరించింది. తొలుత 15 హెలికాప్టర్ల కోసం డిఫెన్స్‌‌‌‌ అక్విజిషన్‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌ ఒప్పందం చేసుకుందని తెలిపింది.