వీధి వ్యాపారుల కోసమే పీఎం స్వానిధి యోజన 

కరోనా నేపథ్యంలో వీధి వ్యాపారులు తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు ఉద్దేశించిన ‘పీఎం స్వానిధి యోజన’ దేశంలో లక్షల మంది వీధి వ్యాపారులకు ఉపశమనం కలిగించడం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. 

దేశంలోని పలువురు వీధి వ్యాపారులతో ఆయన నేడు నేరుగా వెబినార్ ద్వారా మాట్లాడుతూ . ఉజ్వలా, విద్యుత్ కనెక్షన్, ఆయుష్మాన్ భారత్, బీమా యోజన ప్రయోజనాలులతో స్వానిధి యోజనలో చేరిన లబ్ధిదారులను కూడా అనుసంధానం చేస్తామని ప్రధాని హామీ ఇచ్చారు.  

బుధవారం మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిరు వీధి వ్యాపారులతో ఆన్‌లైన్‌లో గంట పాటు మాట్లాడారు. మధ్యప్రదేశ్ ఇండోర్ జిల్లాలోని సేవర్ ప్రాంతానికి చెందిన చిరు వ్యాపారి చగన్‌లాల్‌తో సంభాషణ ప్రారంభమైంది. చగన్‌లాల్ చీపుర్లు తయారు చేసి బండిపై విక్రయిస్తాడు. భార్య, పిల్లలతో కలిసి చీపుర్లు తయారు చేసి విక్రయిస్తానని చగన్ లాల్ చెప్పాడు. పిల్లలను వ్యాపారాలకు కాకుండా చదివించాలని ప్రధాని సూచించారు. 

గ్వాలియర్ నగర్ కు చెందిన అర్చన శర్మతో కూడా ప్రధాని మాట్లాడారు. అర్చన శర్మ బంగాళాదుంప టిక్కీలను తయారు చేసి బండిపై విక్రయిస్తుంది. మోదీ ఆమెతో కాస్సేపు ముచ్చటించి నైపుణ్యాల గురించి ఆమె పిల్లల వద్ద ఆరా తీయగా.. ఆమె పెయింటింగ్ వేస్తుందని చెప్పారు. ఈసారి గ్వాలియర్ వచ్చినప్పుడు ఆమె చేతితో తయారు చేసిన టిక్కి తినిపించాలని కోరారు. 

ప్రధానమంత్రి మోదీ వీధి వ్యాపారులతో సంభాషించే సమయంలో పలు సార్లు కేంద్రం నిర్వహిస్తున్న పథకాలను తెలియజేశారు. ఈ సందర్భంగ పీఎం స్వానిధి యోజన పథకాన్ని ప్రతి ఒక్క చిరు వీధి వ్యాపారి వినియోగించుకుని అభివృద్ధిలోకి రావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి పాల్గొన్నారు.   లబ్ధిదారుల్లో కొందరితో తాను మాట్లాడానని, వారి మాటల్లో ఆశాభావం, నమ్మకం కనిపించాయని ప్రధాని చెప్పారు. ఈ పథకం కింద‌ రెండు నెలల్లోనే ఒక లక్ష మందికిపైగా వీధి వ్యాపారులు లబ్ధిపొందారని ప్ర‌ధాని తెలిపారు.

ఈ పథకం వీధి వ్యాపారులకు కొత్త ఉత్సాహం ఇస్తుందని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశాన్నారు. వ్యవస్థకు లక్షలాది మంది అనుసంధానమవడం ఇదే మొదటిసారని చెబుతూ వారికి ఒక‌ గుర్తింపు లభించిందని ప్ర‌ధాని సంతోషం వ్యక్తం చేశారు.