మంత్రి వెల్లంపల్లి రాజీనామాకు వి హెచ్ పీ డిమాండ్ 

అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి రథాని  దగ్ధం చేసిన ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు వెంటనే పదవికి రాజీనామా చేయాలనీ విశ్వహిందూ పరిషద్ డిమాండ్ చేసింది. ఈ ఘటనపై  ప్రభుత్వం సిబిఐతో దర్యాప్తు చేయించి దోషులను కఠినంగా శిక్షించాలని పరిషద్ నాయకుడు  సత్య రవికుమార్ డిమాండ్ చేశారు  
ప్రాధమిక విచారణ కూడా జరుపకుండా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లనే రధం  దగ్ధమైన్నట్లు మంత్రి ఏవిధంగా చెబుతారని ప్రశ్నించారు. 24 గంటలైనా ఒక్క అధికారిపై కూడా ఎందుకని చర్య తీసుకోలేదని నిలదీశారు. 
రాష్ట్ర వ్యాప్తంగా హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై నిరసనగా విజయవాడ లోని విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో వీహెచ్‌పీ నేతలు, కార్యకర్తలు ధర్నా చేపట్టారు.  వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆంధ్ర ప్రదేశ్ లో హైందవ ధర్మంపై దాడులు జరుగుతున్నాయని  రవికుమార్ విమర్శించారు. 
 
ఇన్ని దాడులు, దారుణాలు జరుగుతున్నా మంత్రులు, అధికారులు స్పందించడం లేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అతి పెద్ద ఆదాయం కలిగిన దేవాలయాలను ప్రభుత్వం తన గుప్పిట్లో పెట్టుకుందని, హిందూ ఆలయాల ఆస్తులను కొల్లగొట్టడమే ప్రభుత్వం ఉద్దేశంగా ఉందని దుయ్యబట్టారు.
హిందూ‌ధర్మాన్ని నీరు గార్చేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని విమర్శించారు. మతి‌ స్థిమితం లేని వారు చేసిన చర్యలుగా ప్రకటించడం సరికాదని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయాలపై జరుగుతున్న దాడులపై న్యాయ స్థానాలను ఆశ్రయిస్తామని వెల్లడించాయిరు. గవర్నర్‌ని కూడా కలిసి ప్రభుత్వం తీరుపై ఫిర్యాదు చేస్తామని సత్య రవికుమార్ స్పష్టం చేశారు.
నోటికి నల్ల రిబన్లు కట్టుకుని  విహెచ్ పి కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఇది క్రైస్తవ ప్రభుత్వం అని ఒక జిల్లా కలెక్టర్ పేర్కొన్నా ముఖ్యమంత్రి మౌనం వహించడంతో రాష్ట్రంలో హిందూ దేవాలయాలకు రక్షణ లేదని స్పష్టం అవుతున్నదని సత్యరావు కుమార్ స్పష్టం చేశారు. హిందూ దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనంకు స్వస్తి పలికి, హిందూ ధార్మిక సంస్థలకు అప్పచెప్పాలని డిమాండ్ చేశారు. 
 
అతి పెద్ద ఆదాయం కలిగిన దేవాలయాలను ప్రభుత్వం తన గుప్పిట్లో పెట్టుకుందని ధ్వజమెత్తుతూ హిందూ ఆలయాల ఆస్తులను కొల్లగొట్టడమే ప్రభుత్వం ఉద్దేశమని విమర్శించారు.
హిందూ‌ధర్మాన్ని నీరు గార్చేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని మండిపడ్డారు.