నెమ్మదిగా కోలుకొంటున్న వాహనరంగం   

కరోనా మహమ్మారి కారణంగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన వాహనరంగం ఇప్పుడిప్పుడే నెమ్మదిగా కోలుకుంటున్నది. ఆగస్టులో వాహన విక్రయాలు మరింత గా పెరిగాయి. కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ డొమెస్టిక్ సేల్స్ 22 శాతం పెరగగా, హ్యుండాయ్ షేర్లు 20 శాతం మేర పెరిగాయి. 

ఇతర కార్ల కంపెనీల విక్రయాల వృద్ధి మిశ్రమంగా ఉన్నప్పటికీ, జూలై మాసంతో పోలిస్తే పెరుగుదలను నమోదు చేశాయి. మారుతీ సుజుకీ డొమెస్టిక్ కారు సేల్స్ 21.7 శాతం పెరిగాయి. అన్ని సేల్స్ కలిసి 17.1 శాతం మేర పెరిగి, 1,24,624 యూనిట్లుగా ఉన్నాయి.

ద్విచక్ర వాహనాల విషయానికి వస్తే హీరో మోటో కార్ప్ సేల్స్ 7.5 శాతం మేర పెరిగాయి. హీరో మోటోకార్ప్ మినహా మిగతా కంపెనీలు అమ్మకాలు వృద్ధిని అంతగా కనబరచలేదు.

దేశవ్యాప్తంగా వ్యవసాయం పనులు జోరుగా సాగుతున్నాయి. దీంతో ట్రాక్టర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. కమర్షియల్ వెహికిల్ అశోక్ లేలాండ్, వోల్వో కమర్షియల్ వెహికిల్ సేల్స్ నిరాశాజనకంగా ఉన్నాయి. బజాజ్ ఆటో సేల్స్ 9 శాతం మేర క్షీణించి 3,56,199 యూనిట్లకు పరిమితం అయ్యాయి.

పుణేకు చెందిన చకన్ ద్విచక్ర వాహనాల సంస్థ గత ఏడాది ఆగస్టులో 2,55,832 వెహికిల్స్ సేల్ చేయగా, ఈసారి 3,90,026కు పెరిగాయి. డొమెస్టిక్ టూ-వీలర్ సేల్స్ సగటున 3 శాతం పెరిగాయి. ఎగుమతులు మాత్రం 6 శాతం తగ్గాయి. 

దేశీయ 3వీలర్ సేల్స్ 78 శాతం పడిపోయి 7,659కు పరిమితం కాగా. త్రీవీలర్ ఎగుమతులు 7 శాతం క్షీణించి 27,782 యూనిట్లకు పరిమితమయ్యాయి.