అరుణాచ‌ల్ స‌రిహ‌ద్దుల్లో బలగాల మోహరింపు 

చైనాతో ఉద్రిక్తతలు పెరిగినప్పటి నుంచి దేశంలోని అరుణాచల్‌ప్ర‌దేశ్‌ సరిహద్దుల వెంబడి భద్రతను భార‌త‌ ప్రభుత్వం కట్టుదిట్టం చేసింది. గ‌త‌ జూన్ నుంచి తూర్పు లడఖ్‌లో చైనా ఆగడాలు మితిమీరుతుండటంతో భద్రతను మరింత‌ పెంచింది. 

సమీప భవిష్యత్తులో చైనాతో యుద్ధం వచ్చే అవకాశాలు లేవని ప్రభుత్వం, సైన్యం చెబుతున్న‌ప్ప‌టికీ అరుణాచల్‌ప్రదేశ్‌లోని అంజా జిల్లాలో క్ర‌మంగా సైన్యం కదలికలు పెరుగుతున్నాయి. అంజా జిల్లా‌ భారత సైన్యం కదలికలు పెరిగాయి. 

చైనా చొరబాట్ల గురించి స్పష్టమైన రికార్డులేవీ లేన‌ప్ప‌టికీ గల్వాన్‌ లోయలో ఘర్షణ అధికారుల కథనం ప్రకారం.. ఆ ప్రాంతంలో ఈ మ‌ధ్యలు జరిగినప్పటి నుంచి దళాల మోహరింపు మరింత పెరిగింది.

 అయితే, అరుణాచల్‌ప్రదేశ్‌ను కూడా చైనా వివాదాస్పదం చేస్తుండ‌టంతో భారత్ అప్ర‌మ‌త్తంగా ఉంటున్న‌ట్లు తెలుస్తున్న‌ది. 1962లో అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్‌లో కోసం భారత్-చైనా మధ్య యుద్దం కూడా జరిగింది. ఇది మళ్ళీ యుద్ధానికి కారణం కావచ్చునని భద్రతా విశ్లేషకులు చెబుతున్నారు. 

మరోవంక,  వాస్తవాధీన రేఖ వెంబడి చైనాతో ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతుండటంతో సరిహద్దుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని భద్రతా బలగాలను హోం శాఖ  ఆదేశించింది. ఇండో-చైనా, ఇండో-నేపాల్, ఇండో-భూటాన్ సరిహద్దుల్లో భద్రతా బలగాలు అత్యంత జాగరూకతతో (హైఅలర్ట్) ఉండాలని హోం శాఖ ఆదేశించినట్టు అధికార వర్గాలు తెలిపాయి.

చైనాకు ఆనుకుని ఉన్న సరిహద్దుల్లో నిఘా, పెట్రోలింగ్ పెంచాలని ఇండో టిబెటెన్ బోర్టర్ పోలీసు (ఐటీబీపీ), సశస్త్ర సీమ బల్ (ఎస్ఎస్‌బీ)‌కు హోం శాఖ తాజా ఆదేశాలిచ్చింది. ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, లద్దాఖ్, సిక్కిం సరిహద్దుల్లో అప్రమత్తతను కొనసాగించాలని ఐటీబీపీని  హోం శాఖ ఆదేశించింది. 

దీనితో పాటు, ఇండో-నేపాల్-చైనా ట్రై జంక్షన్, ఉత్తరాఖండ్‌లోని కాలాపాని ప్రాంతంలో నిఘా పెంచాలని కూడా ఎస్ఎస్‌బీ, ఐటీబీటీలకు ఆదేశాలిచ్చింది. హోం శాఖ తాజా ఆదేశాల నేపథ్యంలో ఎన్‌ఎస్‌బీకి చెందిన పలు కంపెనీలను ఇండియా-నేపాల్ సరిహద్దుకు తరలించారు. ఇంతకుముందు ఈ బలగాలను జమ్మూకశ్మీర్, ఢిల్లీలో మోహరించారు. 

ఎల్ఏసీ వెంబడి భారత భూభాగంలో ఎత్తైన ప్రాంతాల్లో ఉన్న భద్రతా బలగాలను అక్కడి నుంచి కదలవద్దని కూడా ఆదేశాలు జారీ అయినట్టు అధికారులు చెబుతున్నారు. సరిహద్దు ప్రాంతాలను మార్చేందుకు చైనా ఎడతెగని ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో పలు ‘వ్యూహాత్మక హైట్స్’లో భారత ఆర్మీని మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్ లేక్ చుట్టూ కీలక పాయింట్ల వద్ద అదనపు బలగాలను మోహరిస్తున్నారు.