గిడుగు వెంకటరామ్మూర్తికి మోదీ నివాళులు  

వ్యావహారిక భాషోద్యమ నాయకుడు గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం పరిపాటి. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
 
 తెలుగు భాషాభివృద్ధికి పాటుపడుతున్న అందరికీ ముఖ్యంగా యువతకి నా ధన్యవాదాలు. తన సాహిత్యంతో, తన సాంఘిక సంస్కరణా దృక్పథంతో ఎన్నో తరాలపై చెరగని ముద్ర వేసిన గిడుగు వెంకటరామ్మూర్తి గారికి నివాళులు’ అని మోదీ ట్వీట్ చేశారు.  
కాగా,  ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య కూడా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఉన్నతమైన సమాజ నిర్మాణం కోసం భాష, సంస్కృతులే చక్కని పునాది వేస్తాయని ఆయన పేర్కొన్నారు.
గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి అయిన తెలుగు భాషా దినోత్సవం నాడు భాష, సంస్కృతి, సమాజం పరంగా మనం ఎక్కడ ఉన్నామనే అంశాన్ని సింహవలోకనం చేసుకోవటం ముదాహమని తెలిపారు.
మాతృభాష దినోత్సవమంటే నిజమైన స్వాభిమాన దినోత్సవమని పేర్కొన్న ఉపరాష్ట్రపతి, విదేశాల్లో ఉంటూ మాతృభాష కోసం తపిస్తున్న ప్రవాస తెలుగు ప్రజలకు, అదే విధంగా ఈ కార్యక్రమ ఏర్పాటుకు చొరవ తీసుకున్న, పాల్గొన వారందరికీ అభినందనలు తెలియజేశారు.