హైదరాబాద్ మెట్రోకు సన్నాహాలు 

హైదరాబాద్ నగరంలో కరోనా వైరస్ నేపథ్యంలో నిలిచిపోయిన మెట్రో రైళ్లను ప్రభుత్వం అనుమతిస్తే వచ్చే నెలలో నడపడం కోసం  అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అన్‌లాక్ నాల్గో మార్గదర్శకాల్లో భాగంగా కేంద్రం మరిన్ని సడలింపులు ఇవ్వాలని భావిస్తోంది. 

అందులో భాగంగా సెప్టెంబర్ 1నుంచి దేశవ్యాప్తంగా మెట్రో రైలు సేవలకు అనుమతి ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఢిల్లీ మెట్రో పరుగులు పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తుంది. కానీ హైదరాబాద్ మెట్రో అనుమతులు రాష్ట్ర ప్రభుత్వానికి వదిలివేయడంతో సిఎం కెసిఆర్ నిర్ణయం కోసం  మెట్రో అధికారులు ఎదురు చూస్తున్నారు.

లాక్‌డౌన్ నుంచి రోజు కు రూ.4 కోట్లు చొప్పున రూ 800 కోట్ల మేరకు నష్ట పోయిన్నట్లు చెబుతున్నారు.  మరికొన్ని రోజులైతే మెట్రో నడపడం మరింత భారంగా మారి చార్జీలు పెంచాల్సి వస్తుందని నిర్వహకులు పేర్కొంటున్నారు.

మరొపక్క అధికారులు మెట్రో ప్రారంభిస్తే ప్రజలు ఏమేరకు ఆదరిస్తారనే అంశంపై అంశంపై సమాలోచనలు చేస్తున్నారు. రైలు తిరిగితే ఆర్టిసీ బస్సులు కూడ నడపాల్సి వస్తుందని, దీంతో మళ్లీ వైరస్ రెక్కలు కట్టుకుని ప్రజల ప్రాణాలను హరిస్తుందని భావిస్తున్నారు. 

కరోనా నిబంధలకు అనుగుణంగా రైళ్లలో ప్రయాణికుల మధ్య దూరం పాటించేలా చర్యలు తీసుకున్నట్లు, ప్రతి రైలు పూర్తిగా శానిటైజర్ చేసిన తరువాతే పట్టాలపై ఎక్కించి, వైరస్ వ్యాప్తిచెందకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు చెబుతున్నారు. నగరంలో ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లు నడవకపోవడంతో చాలామంది ప్రైవేటు ఉద్యోగులు ఉద్యోగాలకు దూరమైయ్యరు.