క్వారంటైన్‌లో హర్యానా సీఎం మనోహర్ క‌ట్ట‌ర్‌

హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ క‌ట్ట‌ర్ ముందు జాగ్ర‌త్త‌గా మూడు రోజుల పాటు హోం క్వారంటైన్ లోకి వెళ్లారు. కరోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయిన కేంద్ర జలశ‌క్తి శాఖ‌ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో స‌ట్లేజ్ య‌మునా అనుసంధానం అంశంల‌పై ఈ నెల 19న జ‌రిగిన‌ సమావేశంలో సీఎం క‌ట్ట‌ర్ పాల్గొన్నారు. 

గత కొంతకాలంగా తాను కరోనా లక్షణాలున్న పలువురిని కలిశానని, దీంతో కరోనా పరీక్ష చేయించుకోగా కరోనా నెగిటివ్ వచ్చింద‌ని, అయినా ముందుజాగ్రత్త చర్యగా తాను మూడు రోజుల పాటు స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్నానని చెప్పారు.

కరోనా సోకిన కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్ తో కేంద్ర సహాయ మంత్రి రతన్ లాల్ కటారియా కూడా సమావేశంలో పాల్గొనడంతో ఆయన కూడా హోంక్వారంటైన్ లోకి వెళ్లారు. 

హ‌ర్యానా అసెంబ్లీ స‌మావేశాలు ఈ నెల 26న ప్రారంభం కానున్నాయి. దీంతో స‌మావేశాల‌కు హాజ‌ర‌య్యే ప్ర‌తిఒక్క‌రు త‌ప్ప‌నిస‌రిగా క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని స్పీక‌ర్‌ ఆదేశించారు. ఈనేప‌థ్యంలో క‌ట్ట‌ర్ మ‌రోమారు క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోనున్నారు.