కేరళ గోల్డ్‌ స్కామ్‌ లో సీఎం విజయన్!

దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన కేరళ బంగారు అక్రమ రవాణా కేసులో  ముఖ్యమంత్రి పునరాయి విజయన్ పాత్రపై అనుమానాలకు బలం పేరుకొంటున్నది. ఈ కేసులో కీలక నిందితురాలైన స్వప్న సురేష్ ఎవ్వరి తనకు తెయలేదని, ఆమెను ఎప్పుడు కలవని లేదని సీఎం చెబుతూ వస్తున్నారు. అయితే ఆమె విజయన్ అధికార నివాసంకు జూన్ లోనే నాలుగు సార్లు సందర్సించిన్నట్లు ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడైనది.
 
ఆమె మొబైల్ ఫోన్ కాల్స్ వివరాలను పరిశీలించగా ఈ విషయం వెల్లడైన్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే సీఎంఓ కార్యాలయం ప్రిన్సిపాల్ కార్యదర్శి ఎం శివశంకర్ తో స్వప్న సురేష్ కు గల సంబంధాలు ఇప్పటికే బహిర్గతం అయ్యాయి. దానితో ఆయనను సీఎంఓ నుండి తొలగించడమే గాకుండా, సస్పెండ్ చేయవలసి వచ్చింది. 
 
ఈ బంగారు ఆక్రమణ కేసు వెలుగులోకి వచ్చిన గత నెల రోజులుగా సీఎంఓ పరిధిలోని ఐటి విభాగంలో పనిచేస్తున్న స్వప్న సురేష్ ఎవ్వరో తనకు తెలియదని అంటూ ఆమె కేవలం శివశంకర్ సహచరి అని మాత్రమే అన్నట్లు ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆమెవ్వరో తనకు తెలియదని చెప్పలేని పరిస్థితుల్లో చిక్కుకున్నారు. ఆమె తన నివాసానికి ఎందుకు వచ్చారో చెప్పవలసి వస్తుంది. 
 
స్వప్న సురేష్ ముఖ్యమంత్రి అధికార అనివాసంకు సందర్శించడం వెల్లడి కావడంతో ఈ బంగారు అక్రమ రవాణాకు కేంద్ర బిందువు ముఖ్యమంత్రి కుర్యాలయమే కేంద్ర బిందువని స్పష్టమైనదని బిజెపి అధికార ప్రతినిధి సందీప్ వారియర్ స్పష్టం చేశారు. వెంటనే విజయన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 
 
ఒక సాధారణ పౌరునికి ముఖ్యమంత్రి అధికారానివాసంలోకి ప్రవేశించడం అంత సులభం కాదని, మాజీ ముఖ్యమంత్రులవలె అందరికి అందుబాటులో ఉంటె రాజకీయవేత్త విజయన్ కాదని సిపిఐ నేత ఎ జయశంకర్ స్పష్టం చేశారు. 
 
మరోవంక, స్వప్నసురేష్‌తో పాటు సస్పెండ్ అయిన ఐఎఎస్ అధికారి ఎం శివశంకర్ మూడు సార్లు గల్ఫ్ దేశాలు వెళ్లినట్టు దర్యాప్తు సంస్థ విచారణలో తేలింది. పీఎంఎల్‌ఎ (మనీలాండరింగ్ నిరోధక చట్టం) ప్రత్యేక కోర్టు ముందు ఈడీకి దీనికి సంబంధించిన వివరాలను సమర్పించింది.  
 
 శివశంకర్‌ను ప్రశ్నించడాన్ని ప్రస్తావించిన ఈడీ 2017- 2018 మధ్య నిందితులు మూడుసార్లు గల్ఫ్ దేశాలకు వెళ్లారని ఈడీ తెలిపింది. ఏప్రిల్ 2017లో, ఏప్రిల్ 2018 లో, స్వప్న ఓమన్ వెళ్లి దుబాయ్ పర్యటనలో ఉన్న శివశంకర్ ను కలిసిందని, వారిద్దరూ కలిసి భారతదేశానికి తిరిగి వచ్చారని ఈడీ వాదించింది. తిరిగి వరద బాధితుల సహాయార్ధం వెళ్లినపుడు కూడా మరోసారి (అక్టోబర్ 2018లో) సురేష్, శివశంకర్ కలిసి యుఏఈకి వెళ్లి, తిరిగి వచ్చారని తమ విచారణలో తెలిందని చెప్పింది. 
 
అలాగే శివశంకర్ సూచనల మేరకు జాయింట్ బ్యాంక్ లాకర్‌లో దీనికి సంబంధించిన డబ్బులను స్వప్న సురేష్ దాచిపెట్టినట్టు  పేర్కొంది. ఈ నేపథ్యంలో నిందితుల బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించి ఈ అంశాలపై లోతైన దర్యాప్తు జరపాలని కోరింది.  
 
సరిత్, సందీప్ నాయర్ల జ్యుడీషియల్ రిమాండ్ కోరుతూ ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఆగస్టు 26 వరకు కోర్టు నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశిస్తూ ఉత్తర్వులిచ్చింది..